ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ అధినేత, సీఎం జగన్మోహాన్ రెడ్డితో భేటీ నేపథ్యంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వస్తున్న వార్తలను ఖండించారు చిరంజీవి.
తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు రూమర్స్ మాత్రమే అని.. అలాంటి ఆఫర్లు తన వద్దకు రావని చిరంజీవి స్పష్టం చేశారు.
తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. పదవులకు అతీతంగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. ఇక, తాను సీట్ల ఆఫర్లకు ఆశపడేవాడిని కాదని, అలాంటివి కోరుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.