ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శుక్రవారం ఎన్జీటీ తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టరాదని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కారం చర్యలు అవసరం లేదని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే …
Read More »మగబిడ్డకు జన్మనిచ్చిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త భార్గవ్ రామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అఖిలప్రియ తల్లి శోభనాగిరెడ్డి జయంతి రోజునే బాబు పుట్టడంతో భూమా కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. శోభనాగిరెడ్డి మరణంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత మంత్రి …
Read More »ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు సంచలన నిర్ణయం
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇచ్చిన జీవోపై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read More »గవర్నర్ కు సీఎం జగన్ పరామర్శ
ఏపీలోని రాజ్ భవన్ కు రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ దంపతులు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్ దంపతులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని గవర్నర్ తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా గవర్నరు సూచించారు. కాగా గవర్నర్ దంపతులు కరోనా బారినపడి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే.
Read More »ఏపీలో కొత్తగా 132 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,228 కరోనా టెస్టులు చేయగా 132 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 20,75,108కు చేరగా ఇప్పటివరకు 14,468 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఏపీ డిప్యూటీ సీఎం కి అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ముక్కు నుంచి రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
Read More »పోలవరం పనులు వేగవంతం చేయాలి
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20న DDRP (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్వాల్, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్ డిజైన్లను ఆమోదించుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు.
Read More »వైసీపీకి బాబు సవాల్
ఏపీ ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం జగన్‌రెడ్డి తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తే మేం కూడా మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తమకు రాష్ట్ర ప్రజలు పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు కిక్కురునమనడం …
Read More »శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. మాస్కు ధరిస్తేనే మల్లన్న దర్శనం కల్పించాలని ఆలయ ఈవో లవన్న నిర్ణయించారు. ఇటీవల కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో.. కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని లవన్న తెలిపారు. భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని మైక్ ద్వారా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో …
Read More »ప్రయాణికులకు APSRTC శుభవార్త
క్రిస్మస్, సంక్రాంతి పండగకు దూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30 రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును 60 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా.. పండగ సీజన్లలో చివరి నిమిషంలో బస్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి అదనపు ఛార్జీల్ని RTC వడ్డించేది. తాజా నిర్ణయం వల్ల ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ ఛార్జీల బెడద …
Read More »