కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. మాస్కు ధరిస్తేనే మల్లన్న దర్శనం కల్పించాలని ఆలయ ఈవో లవన్న నిర్ణయించారు.
ఇటీవల కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో.. కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని లవన్న తెలిపారు. భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలని మైక్ ద్వారా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మాస్కు ధరించకుండా శ్రీశైలం వీధుల్లో తిరిగేవారికి రూ. 100 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. భక్తులకు టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు.