ఏపీలోని రాజ్ భవన్ కు రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ దంపతులు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్ దంపతులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని గవర్నర్ తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా గవర్నరు సూచించారు. కాగా గవర్నర్ దంపతులు కరోనా బారినపడి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే.