ఏపీలోని మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. TGT, PGTలను జోన్ యూనిట్, ప్రిన్సిపాళ్లను స్టేట్ యూనిట్గా బదిలీ చేస్తారు. 2021 నవంబర్ 1 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు కాగా.. 5 ఏళ్ల సర్వీసు పూర్తైన వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయనుండగా.. అర్హులైన టీచర్లు, ప్రిన్సిపాళ్లు తమ దరఖాస్తులను …
Read More »గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి మళ్లీ అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆయన కరోనా బారి న పడి ఈ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.
Read More »YSRCP MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి అస్వస్థత
ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి అధికార YSRCP MLA ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్కే పాల్గొన్నారు.
Read More »ఏపీలో దారుణం
Apలోని కర్నూలు జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టుకు ఓ యువతి దరఖాస్తు చేసుకుంది. కలెక్టరేట్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ యువతి నెంబర్ తీసుకుని.. ఉద్యోగం కావాలంటే చెప్పింది చేయాలని వేధించడం మొదలుపెట్టాడు. ఓ ఉన్నతాధికారితో ఏకాంతంగా గడిపితే ఉద్యోగం వస్తుందన్నాడు. అప్రమత్తమైన బాధితురాలు కాల్ రికార్డ్ చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన విచారణకు ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు.
Read More »నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగింది
Ap అసెంబ్లీలో చర్చించడానికి ప్రతిపక్షం వద్ద ఏ అంశాలు లేక దురుద్దేశంతో వ్యవహరించిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీని కౌరవ సభ అని చంద్రబాబు వెళ్లిపోయారని విమర్శించారు. నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగిందని మండిపడ్డారు. సభలో బీసీలు, మైనారిటీల అంశాలతో పాటు వరద నష్టంపై చర్చించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ కూడా ఓపిగ్గా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు.
Read More »వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు.. ఒకరికి ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
Read More »కన్నకూతురిపై కన్నతండ్రే..!
ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. తాగుడుకు బానిసైన ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 15 ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. 2 రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేయగా బాలిక గర్భవతి అని తేలింది.
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే స్కూళ్లలో 20 మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులిచ్చి, అనంతరం మూసివేత ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.
Read More »బాబుకు ముద్రగడ ఘాటు లేఖ
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …
Read More »జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయం
ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు
Read More »