Home / ANDHRAPRADESH (page 100)

ANDHRAPRADESH

ఏపీ ,తెలంగాణకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ షాక్

దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) పరిధిలో నడుస్తున్న 72 రైళ్లకు అధికారులు త్వరలో ఉద్వాసన పలకనున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడం వంటి కారణాలతోపాటు.. ఇతర రైళ్లు, గూడ్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సీఆర్‌ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. ఈ రైళ్లన్నీ ఎస్సీఆర్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్‌, గుంతకల్లు డివిజన్లలో సుదీర్ఘకాలం సేవలందించాయి. …

Read More »

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు  కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 80,7,023కి కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య చేరింది. 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,587 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని …

Read More »

ఏపీలో 8లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,422 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 3,746 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,93,299కి చేరుకుంది. రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తూ ర్పుగోదావరి జిల్లాలో 677, కృష్ణాలో 503, చిత్తూరులో 437 …

Read More »

ఏపీలో కరోనా తగ్గుముఖం

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,330 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,86,050కి పెరిగింది. ఏపీలో 3 వేలకు తక్కువ కేసులు నమోదవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో రోజూ 5-10వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. …

Read More »

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్‌.రమణను కొనసాగించారు. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. చాలా రోజుల క్రితమే ఈ కసరత్తును పూర్తి చేసినా మంచి రోజులు లేవనే కారణంతో ఆపారు. ఆదివారం నుంచి ఆ అడ్డంకి తొలగడంతో సోమవారం ప్రకటించారు. అచ్చెన్నాయుడి నియామకాన్ని …

Read More »

ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం

ఏపీలో గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు గురువారం రాత్రి దాడికి యత్నించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ కారులో బయల్దేరగా.. ఎదురుగా వచ్చిన పూర్ణచంద్రరావు తన బైక్‌ను అడ్డుపెట్టి అసభ్య పదజాలంతో దూషించాడు. ఎవరని ప్రశ్నించగా దాడి చేసేందుకు మీదకు రావడంతో భద్రతా …

Read More »

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో అరుదైన అవకాశం

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో అరుదైన అవకాశం దక్కింది. పార్లమెంటరీ ఫ్రెండ్ షిప్ గ్రూప్ పేరిట ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివిధ దేశాలకు మన పార్లమెంట్ సభ్యులను ప్రతినిధులుగా నియమించి నవశకానికి నాంది పలికింది.అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఇరవైమందికి 14 దేశాలకు ప్రతినిధులుగా నియమించారు.ఒక దేశానికి కనీసంగా ఒకరు లేదా ముగ్గురు కూడా నియమితులవగా అందులో మన హిందూపురం ఎంపీ గోరంట్ల …

Read More »

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3,224కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కి చేరింది. ఇందులో 43,983యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మొత్తం 7,08,712మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే నిన్న ఒక్కరోజులోనే ముప్పై రెండు మంది మృతి చెందారు.దీంతో మొత్తం మృతుల సంఖ్య 6256కి చేరింది.

Read More »

వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారుకు ప్రమాదం

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది.తమిళనాడులోని చెన్నై నుండి గూడూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నాయుడుపేట దగ్గర లారీను వైసీపీ ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో డ్రైవర్ శ్రీహారికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే వీర్ని చెన్నైలోని ప్రముఖ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ముందు వెళ్తున్న లారీ …

Read More »

జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. తాడిపత్రి టౌన్‌ పీఎస్‌లో 153/A , 506 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి గనులశాఖ కార్యాలయంలో అధికారులను కించపరిచేలా జేసీ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat