తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఇంతకు ముందు సుబ్బారెడ్డి 2019లో తొలిసారిగా టీటీడీ బోర్డు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టగా.. ఈ ఏడాది జూన్‌లో పదవీకాలం ముగిసింది. ఈ సారి వేరే వారికి చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరకు ఏపీ ప్రభుత్వం మరోసారి బోర్డు చైర్మన్‌గా సుబ్బారెడ్డికే …
Read More »ఏపీ పాలిసెట్-2021 తేదీ ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష (ఏపీ పాలిసెట్-2021)ను సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 380 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పాలిసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా అవసరమైతే దరఖాస్తు గడువును పొడిగిస్తామని …
Read More »ఏపీలో నైట్ కర్ఫ్యూ
ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఆగస్టు 14 వరకు కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కర్ఫ్యూ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.
Read More »శ్రీశైలం నుంచి నీటి విడుదల … 2007 తర్వాత ఇదే మొదటిసారి …
శ్రీశైలం జలాశయం నుంచి నేడు నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జలాశయం గేట్లను పైకెత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 2007 తర్వాత జులైలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ …
Read More »TTD చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.
Read More »నిరుద్యోగులకు అండగా నారా లోకేష్
ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఈ నెల 19న తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడంపై TDP నేత నారా లోకేశ్ స్పందించారు. నిరుద్యోగులను పోలీసులు బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని హెచ్చరించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కొందరు పోలీసులు YCP బానిసల్లా బతుకుతున్నారని.. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాసే హక్కు పోలీసులకు లేదన్నారు.
Read More »బాబుకు షాక్ -టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.! ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై బై చెప్పేసి వైసీపీకి మద్దతివ్వడం.. వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పించేశారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు. అయితే తాజాగా.. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా …
Read More »ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి గుండెపోటు
ఆంధ్రప్రదేశ్ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చంద్రబాబుతో కృష్ణా జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన.. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు.. యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం అర్జునుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Read More »ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1,578 మంది కరోనా బారిన పడ్డారు. మరో 22 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,24,421కు చేరగా, మరణాల సంఖ్య 13,024కు పెరిగింది. కొత్తగా 3,041 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 18,84,202కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »రేవంత్ రెడ్డిపై ఆర్కే రోజా ఫైర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్‌కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని ఇక కేసీఆర్‌తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా అన్నారు. తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా …
Read More »