Home / ANDHRAPRADESH / రేవంత్ రెడ్డిపై ఆర్కే రోజా ఫైర్

రేవంత్ రెడ్డిపై ఆర్కే రోజా ఫైర్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్‌కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని ఇక కేసీఆర్‌తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా అన్నారు.

తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా కాంగ్రెస్‌లోకి వెళ్లారని విమిర్శించారు. రాజకీయంలో ఎదగాలంటే ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. బీజేపీ నాయకులు కూడా రోజా ఇంట్లో జగన్, కేసీఆర్ ఒప్పాందాలు కుదుర్చుకున్నారని మాట్లాడడం చాలా బాధాకరమని రోజా అన్నారు