ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.