ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. 9న రెండవ శనివారం…10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ కారణంగా విద్యా శాఖ పనిచేయనుంది.
Read More »అమ్మఒడి 15వేలు కాదు 14వేలు..ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకానికి రంగం సిద్ధం చేస్తంది. రెండో విడతలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. దాదాపు 45లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈనెల 9న రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ నందు శ్రీవేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “ఈఫోటో”..?. ఎందుకంటే..?
ఏపీలో తిరుపతిలో జరగనున్న పోలీస్ డ్యూటీ మీలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. గుంటూరు అర్బన్ సౌత్ DSP జెస్సి ప్రశాంతి ఈ మీట్ కు హాజరుకాగా.. తిరుపతి కల్యాణి డ్యాంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో CIగా పనిచేస్తున్న ఆమె తండ్రి శ్యాంసుందర్ అటుగా వచ్చారు. తనకంటే పెద్దర్యాంకులో ఉన్న కుమార్తెను చూసి. ఆనందపడ్డ ఆయన, కుమార్తె దగ్గరకు వెళ్లి ‘నమస్తే మేడం’ అనగా, ఆమె కూడా సెల్యూట్ …
Read More »వైఎస్సార్ బాటలో వైఎస్ జగన్
ఏపీలో సంక్రాంతి పండుగ తర్వాత సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను సీఎం నేరుగా కలుస్తారు.. త్వరలోనే ఈ కార్యక్రమంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో ఇళ్ల స్థలాల పంపిణీలో పాల్గొన్న ఆయన.. పేదల కోసం చేస్తున్న మంచి పనులను కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.
Read More »టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా క్లౌపీటలో అనుచరులతో సమావేశమైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో యర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. చంద్రబాబు ఒప్పుకుంటే తిరిగి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు డేవిడ్రాజు అనుచరులతో జరిగిన సమావేశంలో చెప్పారు..
Read More »ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కొత్త ఏడాది కానుక అందించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉద్యోగులకు శుక్రవారం ఉచిత బస్ పాస్టు అందించారు. ఈ ఉచిత బస్ పాస్లు వారి నివాస స్థలం నుంచి 25 కిలో మీటర్లలోపు ప్రయాణానికి వర్తిస్తాయి. ఈ పాస్ల వల్ల 5 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
Read More »ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 8,81,273కు చేరింది. 7,098 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 3,423 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 8,70,752 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో …
Read More »ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 354 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టివరకు 8,80,430 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,69,478 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 3,861 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా 7,091 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో …
Read More »ఏపీ సీఎం జగన్ కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…”ఏపీ సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురాగ్యాలతో ఉంటూ… ఎక్కువ కాలం ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను అన్న” అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్ కూడా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు. వైఎస్ జగన్‌తో పాటు …
Read More »ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 506 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 63,873 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 506 మంది వైరస్ బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 104, గుంటూరులో 69, పశ్చిమగోదావరిలో 66, కృష్ణాలో 59 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,75,531 మంది కరోనా బారినపడగా, 8,63,508 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,966 మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »