Home / MOVIES (page 176)

MOVIES

మాధురీ దీక్షిత్ అందానికి కారణం అదే.?

1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది. ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.

Read More »

‘ప్రాజెక్ట్-కె’ మూవీపై భారీ అంచనాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల వేగాన్ని పెంచాడు. నాట్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న ‘ప్రాజెక్ట్-కె’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ మొదటివారం నుంచి మొదలుకానుంది. కొత్త షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ అవుతాడట. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో భారీ సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దాదాపు రూ.300 కోట్లు బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుంది.

Read More »

బాలయ్యను ఆకాశానికెత్తిన Heroine

Tollywood Star Hero..నందమూరి అందగాడు బాలయ్యపై నటి ప్రగ్యా జైస్వాల్ ప్రశంసలు కురిపించింది. అఖండ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఆయనతో నటించాలనగానే ఎంతో సర్వస్ ఫీలయ్యాను. ఆయన్ను కలిసిన 5 నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్ ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్ను నేను ఇంత వరకు చూడలేదు. …

Read More »

టాలీవుడ్లో మరో విషాదం

టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావుకు ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా.. తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ కుమారుడు, కూతురు, భార్య ఉన్నారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా తొలి సినిమా. ఆ తర్వాత రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ నాగేశ్వరరావు తెరకెక్కించిన పోలీస్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి సినిమాలు చేశారు.

Read More »

శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం

ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. కరోనాతో హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 75% ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలో ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ఆసుపత్రి బిల్లులు చాలా ఎక్కువయ్యాయని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా చిన్న కుమారుడు అజయ్ కోరుతున్నారు

Read More »

రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి

రాజస్థాన్లో ఇటీవల కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర సింగ్ గుదా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలన్న ఆయన కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి. తన సొంత నియోజకవర్గం ఉదయపూర్వతిలో ఆయన పర్యటించగా.. రోడ్లను బాగుచేయాలని ప్రజలు మంత్రిని కోరారు. దీంతో అధికారులతో సమావేశమైన మంత్రి.. తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా బుగ్గల్లా మెరవాలని ఆదేశించారు.

Read More »

అమ్మవారి అవతారంలో మిల్క్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి ..మిల్కీ బ్యూటీ తమన్నా అమ్మవారి అవతారంలో దర్శనమిచ్చి ఫ్యాన్స్ను సరైజ్ చేసింది. ఆ గెటప్తో అరటి ఆకులో భోజనం చేస్తున్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ‘అరటి ఆకులో తింటుంటే నాకు దేవతననే ఫీలింగ్ కలుగుతోంది. ఈ ఆకులు మనకు సులభంగా లభిస్తాయి. వీటిలో తినడం పర్యావరణానికి ఎంతో మంచిది’ అని ఈ బ్యూటీ రాసుకొచ్చింది. కాగా, షూటింగ్లో భాగంగా తమన్నా …

Read More »

కంగనా రనౌత్ పై మరో కేసు నమోదు

బాలీవుడ్ నటి.. ఎప్పుడు వివాదంలో ఉండే కంగన రనౌత్ పై మరోసారి కేసు నమోదైంది. రైతుల ఉద్యమాన్ని ‘ఖలీస్థానీ మూమెంట్’ తో పోలుస్తూ ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ  నేపథ్యంలో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీసులు సెక్షన్ 295A(ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను అవమానించడం) కింద కంగనపై కేసు నమోదు చేశారు.

Read More »

మంచు విష్ణు మరో సంచలన నిర్ణయం

Tollywood కి చెందిన’మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించాడు అధ్యక్షుడు మంచు విష్ణు. తాజాగా AIG, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ‘మా’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు విష్ణు తెలిపాడు. అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపాడు.

Read More »

ఆ కోరిక నెరవేరింది అంటున్న పూజా హెగ్డే

టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. అందాల రాక్షసిగా పేరున్న ఉన్న పూజాహెగ్దే.. హాలిడే ట్రిప్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టింది. తాజాగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో ఉన్న పిక్ షేర్ చేసింది..  ఈ క్రమంలో పూజా ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పట్నుంచో ఉన్న కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. మరిన్ని విశేషాల కోసం వేచి చూడండి అని పోస్ట్ చేసింది. ఇక, వీరిద్దరు కలిసి ఏదైనా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat