దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 23,950కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కి చేరుకుంది. ఇందులో మొత్తం యాక్టివ్ కేసులు 2,89,240. మొత్తం కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 96,63,382. తాజాగా కరోనాతో 333మంది మృత్యు వాత పడ్డారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు1,46,444మంది మరణించారు.
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై 2 తర్వాత ఈ స్థాయిలో తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. కొత్తగా 30,376 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 96,36,487 కోలుకున్నారు. మరో 301 మృతి …
Read More »ఉత్తరప్రదేశ్‌లో ఘోరం
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ను కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. యూపీ 32 కేడబ్ల్యూ 6788 కారులో ఐదుగురు ఢిల్లీ వైపు వెళ్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఖండౌలి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో, టోల్‌ప్లాజాకు నాలుగు కిలోమీటర్ల ముందు ఓ ట్యాంకర్‌ను ఓవర్‌టెక్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో …
Read More »రజనీకాంత్ పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు
తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజకీయాలలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించగా, సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 31న పార్టీపై అఫీషియల్ ప్రకటన చేయనున్నాడు. ప్రస్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర కసరత్తులు చేస్తున్నాడట. జనవరి 14 లేదా 17 …
Read More »బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వెర్షన్
బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటి పోయిందంటూ ఏకంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీలాంటి దేశాలు నిషేధం విధించాయి. కరోనా కొత్త వేరియంట్ తమ దేశాల్లో అడుగుపెట్టకుండా వీళ్లు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం …
Read More »పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్
పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్. బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మండల్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తృణమూల్ పార్టీ ఎంపీ సౌగత రాయ్, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో సుజాత మండల్ తృణమూల్‌లో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. బీజేపీ కోసం కష్టపడి పని …
Read More »24గంటల్లో దేశంలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు
గడిచిన 24గంటల్లో దేశంలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్క్‌ను దాటింది. అమెరికా తర్వాత కోటి కరోనా వైరస్ కేసులను దాటిన రెండో దేశంగా భారత్ నిలిచింది. జనవరి 30న కేరళలో తొలికేసు నమోదైన నుంచి ఇప్పటి నుంచి 95.5లక్షల మంది కోలుకున్నారు. తాజాగా 347 మంది వైరస్‌కు బలవగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,45,136కు …
Read More »వధువు వెన్నెముకకు గాయం.. వరుడు ఏం చేశాడంటే..
కాబోయే భార్యకు తీవ్ర గాయమైతే ఏం చేస్తాం.. ఆమె తనకొద్దు అంటూ పెళ్లి రద్దు చేసుకుంటాం.. లేదంటే ముఖం చాటేస్తాం. కానీ ఈ యువకుడు మాత్రం అలా చేయలేదు. తనకు కాబోయే భార్య వెన్నెముకకు గాయమైనప్పటికీ.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ముందుకు వచ్చాడు. ముందే నిశ్చయించుకున్న ముహుర్తానికి.. ఆస్పత్రిలోనే డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన …
Read More »ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా పాజిటివ్
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ట్వీట్టర్‌లో శుక్రవారం ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తనకు కరోనా లక్షణాలేవి లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రావత్ కోరారు. కొంతకాలం ఇంటి నుంచే పాలనా …
Read More »ఒకే మండపంలో తల్లీకూతుళ్ల పెళ్లి
తోబుట్టువులు, స్నేహితులు ఒకే మండపంలో పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. కానీ UP గోరఖ్ పూర్ జిల్లాలో మాత్రం తల్లీకూతుళ్లు ఒకే వేదికపై వివాహాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం షిప్రాలి గ్రామంలో ‘ముఖ్యమంత్రి సాముహిక్ వివాహ్ యోజన’ కింద 63 పెళ్లిళ్లు చేసింది. ఇందులో బేలాదేవి(53) జగదీశ్(55) అనే వ్యక్తిని పెళ్లాడింది. అదే మండపంలో ఆమె కూమార్తె ఇందు(27)కు వివాహమైంది. ప్రస్తుతం ఈ జంట వివాహాలు చర్చనీయాంశమయ్యాయి.
Read More »