దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం తాజాగా మరో 77,266 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,057 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 61,529కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 25,83,948కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,42,023గా ఉంది. …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే షాకిచ్చిన హ్యాకర్లు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్ చేశారు. కేంద్ర మంత్రి కాకముందు ఈ వెబ్‌సైట్‌ను తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ వెబ్‌సైట్‌ను అంతగా వినియోగించడం లేదు. ఆగస్టు 15న ఈ వెబ్‌సైట్ హ్యాక్ అవగా.. ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వెబ్‌సైట్ హ్యాక్ అయినట్టుగా కిషన్‌రెడ్డి కార్యాలయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు …
Read More »ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తిరువనంతపురం ఎంపీ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ గారు . గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఉద్యమంలా కొనసాగుతుంది . చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు విసిరినా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఢిల్లీ లోని తన అధికార నివాసంలో మొక్కలు నాటిన తిరువంతపురం ఎంపీ శశి థరూర్ గారు …
Read More »కరోనాపై గుడ్ న్యూస్
టెస్టుల సంఖ్య భారీగా పెంచడం, సమర్థవంతమైన ట్రాకింగ్, మెరుగైన వైద్య సదుపాయాలు తదితర చర్యలతో భారత్‌లో కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 65 వేలకుపైగా కేసులు నమోదవుతున్నప్పటికీ.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం ఆస్పత్రులపై భారాన్ని తగ్గిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 63,631 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 22,22,577కి …
Read More »భారత్‌లో ఒక్కరోజే 69వేల కేసులు
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,925కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 20లక్షల 96వేల మంది కోలుకోగా మరో 6లక్షల …
Read More »మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్‌లో చేరారు. అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో …
Read More »మేఘాలయగా గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్
గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకు ముందు ఆయన జమ్మూకశ్మీర్, బీహార్ గవర్నర్‌గా పని చేశారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారికి గోవా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. 2018 ఆగస్టులో ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా …
Read More »కేసులు తగ్గినా తగ్గని మరణాల శాతం
దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గాయి. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 57,981 మంది వైరస్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నెల 11వ తేదీన 53 వేల కేసులు రాగా.. తర్వాత ప్రతి రోజు 60 వేలు దాటాయి. కొత్తగా బాధితుల సంఖ్య తగ్గింది. అయితే, మరణాలు మాత్రం 941 నమోదయ్యాయి. మరోవైపు దేశంలో పరీక్షల సంఖ్య 3 …
Read More »ప్రతి ఒక్కరికి కరోనా టీకా
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో శనివారం ప్రధాని మోదీ దేశీయంగా తయారయ్యే టీకాల గురించి ప్రస్తావించారు. వాటి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రతి ఒక్కరు కరోనా వైరస్ టీకా కోసం ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు కంపెనీలు తమ టీకాలకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయని మీకు తెలియజేయాలను కుంటున్నాను. మన నిపుణులు, శాస్త్రవేత్తలు వాటికి …
Read More »