తెలంగాణ రాష్ట్ర బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని టీడీపీ,కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు వెళ్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ,మాజీ ఎంపీ రవింద్రనాయక్ ఈ రోజు బుధవారం బీజేపీలో చేరనున్నారు. వీరితో కలిసి తాను దేశ రాజధాని ఢిల్లీ నగరానికెళ్ళి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో …
Read More »భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలింపు.. డీకే శివకుమార్ అరెస్ట్..!!
ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌పై గతేడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మనీల్యాండరింగ్ కేసులో శివకుమార్‌ను మంగళవారం రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. గత కొన్నిరోజులుగా శివకుమార్‌ను ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శివకుమార్ భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలించినట్లు గతంలోనే ఐటీశాఖ గుర్తించింది. సోమవారం …
Read More »నష్టాల్లో మార్కెట్లు..!
దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 36,562వద్ద ముగిసింది. నిప్టీ 225పాయింట్ల నష్టంతో 10,797వద్ద ముగిసింది. అయితే కేంద్ర సర్కారు ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయం ,అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా పలు బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి.
Read More »తెలుగోడి దెబ్బ అదుర్స్..ఇంతకన్నా ఏం కావాలి..!
టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్ట్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు ప్రపంచ కప్ తరువాత ఆడిన మొదటి సిరీస్ ఇదే. అయితే మూడు ఫార్మాట్లో వెస్టిండీస్ ను మట్టికరిపించి ఘనవిజయం సాదించింది. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రా కుర్రాడు హనుమా విహారి.. ఈ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో సెలెక్టర్ల దృష్టిలో …
Read More »ఎంపీ వాహనంపై దాడి
పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌పై దాడి ఘటన మరువకముందే మరో బెంగాల్ నేతపై తృణమూల్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. బరక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనంపై ఆదివారం మధ్యాహ్నం కొందరు తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా శ్యామ్‌నగర్‌లోని ఫీడర్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు జరిపిన …
Read More »గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నరసింహన్ స్థానంలో ఎవరిని నియమించాలన్నది కూడా సూత్రప్రాయంగా ఖరారు చేసినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడుకే చెందిన మరొకరిని తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉన్నాయి. గత కొంతకాలంగా గవర్నర్ బదిలీ విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటికీ …
Read More »బండి బయటకు తీస్తోన్నారా.. అయితే ఇది మీకోసమే..!
దేశ వ్యాప్తంగా ఉన్న పలు వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు నుండి ట్రాఫిక్ చలాన్లు మారనున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అధిగమించినవారికి ఈ మారిన చలాన్లు జేబులను గుళ్ల చేయనున్నాయి. మోటర్ వాహానాల చట్టం 1988కి కేంద్ర సర్కారు చేసిన సవరణలు ఈ రోజు ఆదివారం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి అమల్లోకి రానున్నాయి. మరి ముఖ్యంగా కోర్టుకెళ్ళే కేసుల్లో ఈ కొత్త సవరణల్లో తీసుకున్న జరిమానాలనే న్యాయస్థానాలు విధించే …
Read More »ఆంధ్రా బ్యాంకు పుట్టు పుర్వోత్తరాల గురించి మీకు తెలియని రహస్యాలు..!
ఆంధ్రా బ్యాంకు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరుండరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఈ బ్యాంకు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురుకు తెల్సిన పేరు. అయితే ఈ బ్యాంకును యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో వీలినం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న శుక్రవారం ప్రకటించిన సంగతి విధితమే. అయితే ఈ బ్యాంకు ఎప్పుడు.. …
Read More »కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..20 మంది మృతి..70 మంది మంటల్లో
మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధూలే జిల్లా సిర్‌పూర్ గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. సిలిండర్ పేలుడుతో మంటలు ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన ఘటనలో సుమారుగా 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్ర గాయాలపాలు కాగా 70 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడున్న వారంతా హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు. కాగా …
Read More »తెలుగు తేజం పీవీ సింధును అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ..!
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ఇండియాకు చేరుకున్నారు. సోమవారం రాత్రి స్విట్జర్లాండ్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో సింధు మాట్లాడుతూ… ‘దేశానికి మరిన్ని మెడల్స్ అందిస్తా. అభిమానుల అందరికి ధన్యవాదాలు. దేశంలోని ప్రజల అందరి ఆశీస్సులు, ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు’ సింధు తెలిపింది. తరువాత పీవీ సింధు ప్రధాని నరేంద్ర …
Read More »