త్వరలో దేశంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ప్రకటించే అవకాశముంది. పంజాబ్ సీఎంగా భగవంతు చేయాలని తాను భావిస్తున్నట్లు ఆప్ అధినేత కేజీవాల్ తెలిపారు. అయితే ప్రజలే దీనిని నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం అభ్యర్థిని వారం రోజుల్లో ప్రకటిస్తానని ఇటీవల ప్రకటించారు కేజీవాల్. ఈక్రమంలో సీఎం అభ్యర్థిపై సూచన ప్రాయంగా ఒక ప్రకటన చేశారు.
Read More »BJP కి షాక్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నిష్క్రమిస్తున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు సహా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. తాజాగా ఓబీసీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, బీసీలు, మైనారిటీలను పట్టించుకోలేదని లేఖలో ఆరోపించారు.
Read More »ఉద్యోగులకు మోదీ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం
దేశంలోని ఉద్యోగులకు మోదీ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచనుంది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కౌ50వేలుగా ఉంది. దీన్ని 30-35 శాతానికి పెంచనున్నారు. వచ్చే బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అయితే ఉద్యోగులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకొని ఉంటే.. వారికి స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ లభించదు. పాత పన్ను విధానంలో ఈ ప్రయోజనం ఉంటుంది.
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో.. ‘పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తగ్గించాలని కోట్ల మంది రైతుల తరఫున కోరుతున్నా. ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.. ధాన్యం కొనుగోళ్లు ఆపారు. వ్యవసాయ ఖర్చును విపరీతంగా పెంచారు. రైతులకు విద్యుత్ మీటర్లు పెట్టి వారి ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Read More »ఒమిక్రాన్ కు వ్యాక్సిన్
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంటు కి మార్చి నాటికి టీకాను తీసుకురానున్నట్లు ఫైజర్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయని వెల్లడించింది. ఇప్పుడు మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు ఫైజర్ నుంచి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోసు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్ను తీసుకోవడంతో పాటు ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.
Read More »సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని కేసీఆర్.. లాలూతో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని లాలూ కోరినట్లు సమాచారం. కేసీఆర్ పాలనా అనుభవం దేశానికి అవసరముందని లాలూ అన్నట్లు తెలిసింది.
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశంలో ప్రస్తుతం కరోనా భీభత్సం సృష్టిస్తున్నది.పలు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కొత్తగా 21,259 కోవిడ్ కేసులు పశ్చిమబెంగాల్లో కొత్తగా 21,098 మందికి కోవిడ్ తమిళనాడులో కొత్తగా 15,379 కేసులు నమోదు కర్ణాటకలో కొత్తగా 14,473 మందికి కరోనా కేరళలో కొత్తగా 9,066 కొవిడ్ కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ …
Read More »దేశంలో కొత్తగా 1,79,723కరోనా కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,79,723 కరోనా కేసులు, 146 మరణాలు నమోదయ్యాయి. నిన్నటి (1.59 లక్షలు)తో పోలిస్తే కేసులు పెరగ్గా, మరణాలు 327 నుంచి 146కు తగ్గాయి. 46,569 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,23,619 ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 29,60,975 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఒమిక్రాన్ కేసులు 4033కు చేరాయి.
Read More »మహారాష్ట్రలో కరోనా భీభత్సం
మహారాష్ట్రలో గత 24గంటల్లో కొత్తగా 44,388 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 19,474 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. మహమ్మారి వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 2.02లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,59,632 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18వేల కేసులు ఎక్కువగా వచ్చాయి. పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 10.21%గా నమోదైంది. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల 90వేలు దాటింది. ఇక 24గంటల్లో కరోనా మహమ్మారితో మరో 327 మంది మరణించారు. 40,863 మంది కోలుకున్నారు.
Read More »