గత ఫిబ్రవరిలో అమెరికాలోని తెలుగు ఇంజినీర్ హత్య ఉదంతం కొత్త మలుపు తిరిగింది. అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల(32) హత్యకేసులో నిందితుడు ఆడం ప్యూరింటన్(52) తాను తప్పు చేశానన్న భావనను వ్యక్తం చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్ పట్టణంలోని ఒక బార్‌లో ప్యూరింటన్ అనే మాజీ నేవీ ఉద్యోగి శ్రీనివాస్‌ను జాతిపరమైన వివక్షతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణ శుక్రవారం …
Read More »ప్రత్యేక హోదా పై లేని ప్రేమ.. పోలవరంపై ఎందుకు బాబూ..!
ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. తాజాగా చంద్రబాబు కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటున్నారనే వార్తలు మీడియాలో జోరందుకున్నాయి. దీంతో తాజాగా విమర్శలు జోరు కూడా అంతే రేంజ్‌లో ఊపందుకుంది. విషయంలోకి వెళ్తే.. 2014లో బీజేపీ-టీడీపీలు సంయుక్తంగా జట్టుకట్టి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా బాబు కేంద్రంలో రెండు మంత్రి పదవులు …
Read More »సీఎం కేసీఆర్ ఎఫెక్ట్: ఒక్కరోజే 13303 డీడీలు తీసిన డీలర్లు.!!
సమ్మె పేరుతో రాష్ట్రంలో కొంత మంది డిడిలు కట్టకపోవడం వల్ల డిసెంబర్ నెలలో పేదలకు నిత్యవసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ..పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజెందర్, కమిషనర్ సివి ఆనంద్ లతో సమీక్ష నిర్వహించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న డీలర్లను వెంటనే తొలగించి, కొత్త డీలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »నిరుద్యోగులకు కోదండరాం క్షమాపణ చెప్పాలి
నిరుద్యోగులకు కోదండరాం క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేసారు . ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోదండరాం రాజకీయ దళారిగా వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు కొమ్ము కాస్తూ, వారి ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలతో చేసుకున్న ఒప్పందం ఏంటో కోదండరాం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్‌పై ఉద్దేశపూర్వకంగానే …
Read More »ఆర్కే నగర్ ఉపఎన్నిక బరిలో హిరో విశాల్..!
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి సినీ నటుడు విశాల్ రంగప్రవేశం చేశారు. ఆర్కేనగర్ ఉపఎన్నికలో పోటీచేయనున్నట్లు ఇవాళ ఆయన మీడియా ద్వారా ప్రకటించారు. సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. తన రాజకీయ ప్రవేశానికి కారణం ప్రస్తుతం చెప్పనప్పటికీ నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం వెల్లడిస్తానని చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగానే ఉపఎన్నికలో తలపడనున్నట్లు పేర్కొన్నారు.
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 25వ రోజు షెడ్యూల్ ఇదే
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జొన్నగిరి, ఎర్రగుడికి చేరుకొని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం …
Read More »ఆర్.కృష్ణయ్య రాజీనామా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా కాపులను బీసీల్లో చేరుస్తూ, బీసీ-ఎఫ్ కేటగిరీలో 5శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కాపులను బీసీల్లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని …
Read More »డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నక్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు శనివారం తుదిశ్వాస విడిచారు. ఈయన ప్రభుదేవా గురువు. ఈ వార్త తెలుసుకున్న ప్రభుదేవా.. కన్నీటి పర్యంతమయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌కు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. తర్వాత ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.20వ ఏట నుంచే డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్న ధర్మరాజు.. తన చిన్నాన్న బీవీ నరసింహరావు దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడిన ఆయన ‘లవకుశ’, సీతారామ కళ్యాణం’, ‘ఆదిత్య …
Read More »ఒబామాకు పూనమ్ కౌర్ ఇచ్చిన కానుక ఏంటో తెలుసా
భారత దేశ పర్యటనలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సినీ నటి పూనమ్ కౌర్ ప్రత్యేక కానుక ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ నిర్వహించి లీడర్‌షిప్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి వెళ్లిన పూనమ్, ఒబామాను కలిశారు. ఈ సందర్భంగా పూనమ్ చేనేత వస్త్రాలను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన జీవితంలో …
Read More »త్వరలోనే మూడు మెట్రో కారిడార్లు పూర్తి..మంత్రి మహేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో చేపట్టిన మూడు మెట్రో కారిడార్లు త్వరలోనే పూర్తై ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన “హైదరాబాద్ ఇంటర్నేనేషల్ ఆటో షో” ఐదవ ఎడిషన్‌ను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో సేవలను ప్రారంభం నుంచి ప్రతీరోజు లక్ష మంది వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. మిగతా …
Read More »