Politics తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో వేషకు పడ్డారు సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం ఆలోచనను కచ్చితంగా భగ్నం చేస్తామని అన్నారు అందరం కలిసి ఉద్యమానికి శ్రీకారం చుట్టి సింగరేణి కాపాడుకుంటామని అన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం కుట్రను తామంతా కలిసి ముందుకు సాగనీయమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు అలాగే సింగరేణి కార్మికులు అన్ని రాజకీయ నాయకులు …
Read More »Politics : ప్రగతి భవన్ ను కూల్చడమే కాంగ్రెస్ లక్ష్యమా.. కేటీఆర్..
Politics తాజాగా తెలంగాణ శాసనసభలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ భాజపా కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ధరణిని రద్దు చేయడం ప్రగతి భవన్ ను బద్దలు కొట్టడం కాంగ్రెస్ విధానము అంటూ ప్రశ్నించారు.. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ధరణిని రద్దు చేయడం ప్రగతి భవన్ ను బద్దలు కొట్టి …
Read More »Politics : బినామీల పేరుతో ప్రజలను మోసం చేసింది చంద్రబాబే.. సజ్జల రామకృష్ణారెడ్డి..
Politics ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా తెదేపా ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్పష్టమైన అవగాహన తమకుందని అన్నారు అలాగే.. “సీఎం జగన్‌పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారు. …
Read More »తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11న నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరు ఖరారు అయింది. బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా 2021, నవంబర్ నెలలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్న విషయం విదితమే.
Read More »ఎంసెట్ పరీక్షలకు హాజరై విద్యార్థులకు శుభవార్త
తెలంగాణలో మే 7న ఎంసెట్ పరీక్ష జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ పరీక్షలకు హజరై విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్లో ఇంటర్ ఫస్టియర్ 70% సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. సెకండియర్లో 100% సిలబస్ చదవాల్సిందేనని పేర్కొన్నారు. 2021-22లో కరోనా కారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70% సిలబస్తో పరీక్షలు రాశారని.. ఎంసెట్లో కూడా అదే సిలబస్ ఉంటుందన్నారు.
Read More »విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.
Read More »ఈ నెల 11న హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్ల పరేడ్కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.
Read More »మంత్రులు,ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని… విచారణ జరిగితే మిగిలిన వారి ట్యాపింగ్ విషయాలు బయటపడతాయని వెనకడుగు వేస్తోందని చెప్పారు. మేయర్తోపాటు 11 మంది కార్పోరేటర్లు తనతోపాటు ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.
Read More »ప్రభాస్, కృతిసనన్ ప్రేమలో ఉన్నారా..?
పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ..డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రభాస్, కృతి ఎంగేజ్మెంట్ మాల్దీవుల్లో జరగనుందనే ప్రచారం మొదలైంది. దీనిపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘ప్రభాస్, కృతి మంచి ఫ్రెండ్స్. మాల్దీవుల్లో వారి ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తల్లో నిజంలేదు’ అని ప్రకటించింది. ఆదిపురుష్ లో వీరిద్దరూ నటిస్తున్నారు.
Read More »మెగా అభిమానులకు శుభవార్త
ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘లియో’పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ భాగం.. ‘విక్రమ్’, ‘ఖైదీ’ చిత్రాలతో సంబంధం ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఈ అంచనాలను పెంచే టాక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ ‘లియో’ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ వార్తలపై మూవీ టీమ్ స్పందించాల్సి …
Read More »