తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్రిస్మస్ పండుగ సందర్భంగా రాయపర్తి చర్చిలో ప్రభుత్వం తరుఫున గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలను గుర్తించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పండుగల సందర్భంగా ఆయ మతాలకు చెందిన పేదలకు దుస్తులు, విందులు ఆహార పదార్థాలు అందజేస్తూ అన్ని మతాలను భాగస్వాములు …
Read More »కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్రమైన కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమే అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్రత ఉన్నదో ఆ దేశం వెల్లడించాలని టెడ్రోస్ కోరారు. హాస్పిటళ్లలో జరుగుతున్న అడ్మిషన్లు, …
Read More »ఎక్స్‌బీబీ కరోనా ప్రాణాంతకమా..?
కొవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రారంభమైందని.. ప్రాణాంతకమని.. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి దగ్గు, జ్వరం వంటివేమీ ఉండవని.. కీళ్ల నొప్పులు, తలనొప్పి, న్యూమోనియా వంటివి పరిమితంగా ఉంటాయని సదరు న్యూస్ సారాంశం. దీని మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్న …
Read More »ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలలో వైఎస్ఆర్‌సీపీ అభిమానులు తమకు వీలయిన చోట్ల అభిమానంతో తమ ప్రియనేత జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దుబాయిలోని వైఎస్ఆర్‌సీపీ అభిమానులు బుధవారం జగన్ జన్మదినోత్సవ వేడుకలను సందడిగా నిర్వహించారు. గల్ఫ్ దేశాలలో స్ధానిక అరబ్ ప్రజలకు ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల తరహా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ …
Read More »అందాలతో మదిని దోచుకుంటున్న భూమి పెడ్నేకర్
బాబుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వేదికగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ రాజకీయాలు తెలంగాణ లో చెల్లవని స్పష్టం చేశారు. చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అని అన్నారు. చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నారని …
Read More »నిమ్స్ లో సమ్మెలు నిషేధం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని నిమ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సమ్మెలు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుండి ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించారు. ఎస్మా చట్టం ప్రకారం సమ్మెలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అత్యవర వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.
Read More »గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని గీసుగొండ మండలం కొనాయిమాకుల గ్రామంలో రూ.87.45 లక్షల వ్యయంతో బాలసదనం భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆధునిక వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం, రూ.7.71 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు. …
Read More »గాజులరామారం డివిజన్ లో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని బేకరి గడ్డ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ చర్చ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద కుటుంబాల్లో ఆనందం …
Read More »అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని వివేకానంద్ నగర్ కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ చర్చ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద …
Read More »