చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్రమైన కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమే అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు.
అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్రత ఉన్నదో ఆ దేశం వెల్లడించాలని టెడ్రోస్ కోరారు. హాస్పిటళ్లలో జరుగుతున్న అడ్మిషన్లు, ఇంటెన్సివ్ కేర్ అవసరాల గురించి డ్రాగన్ దేశం వెల్లడించాలని ఆయన తెలిపారు.యాక్సిన్ ప్రక్రియపై ఫోకస్ చేసే రీతిలో చైనాకు మద్దతు ఇస్తున్నట్లు టెడ్రోస్ చెప్పారు.
ఆ దేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు 2020 నుంచి జీరో కోవిడ్ పాలసీలో భాగంగా కఠిన ఆరోగ్య ఆంక్షలను చైనా అమలు చేస్తోంది. కానీ ఇటీవల నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఆంక్షలను ఎత్తివేసిన విషయం తెలిసిందే.