Home / SLIDER (page 468)

SLIDER

సోనియా గాంధీకి మరోకసారి ఈడీ నోటీసులు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ మరోకసారి  తాజాగా నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన వ్యవహారంలో నగదు అక్రమ చలామణిపై విచారణ నిమిత్తం.. ఈ నెల 23న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. కాగా ఈ కేసులో విచారణ కోసం ఈ నెల 8వ తేదీనే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కరోనా సోకడంతో మరో తేదీని కేటాయించాలని ఆమె EDని అభ్యర్థించారు. …

Read More »

మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై కేసు నమోదు.. ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలైన  మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదైంది. ఈ నెల 9వ తేదీన అంటే సుంద‌రానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మ‌దాపూర్ శిల్ప‌క‌ళా వేదిక‌లో మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియా క‌లిసి నిర్వ‌హించాయి. ఈ ఈవెంట్‌కు ఆ సంస్థ‌లు ఎలాంటి అనుమ‌తి తీసుకోలేదు. దీంతో …

Read More »

అగ్రహీరోలపై MS రాజు సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ లోనే బడా నిర్మాతగా.. సంక్రాంతి నిర్మాతగా  పేరు తెచ్చుకున్న MS రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరోలపై సంచలన   వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఎంఎస్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరోలు.. సీనియర్లైన సరే ‘పదేపదే స్టార్ హీరోలతో సినిమాలు తీయను. కథే ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా …

Read More »

జొన్నరొట్టెతో ప్రయోజనాలు ఎన్నో..?

జొన్నరొట్టెతో ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి జొన్న రొట్టెలు తినడం వల్ల లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *షుగర్ పేషంట్లకు ఎంతో ఉపయోగకరం. *శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. *గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. *జీర్ణక్రియకు మేలు చేస్తుంది *జుట్టు ఒత్తుగా, బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. *రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *అధిక బరువును కోల్పోవచ్చు. *కంటిచూపు పెరుగుతుంది.

Read More »

దేశంలో కరోనా కలవరం

గత వారంరోజులుగా దేశ వ్యాప్తంగా కొత్తగా  కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతున్నాయి.ఈ రోజు కొత్త కరోనా కేసుల  సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

మంత్రులు, ఎంపీలతో కేసీఆర్‌ కీలక భేటీ..

రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పాలన. రాజకీయ పరమైన అంశాలపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతల అభిప్రాయాలను కేసీఆర్‌ తెలుసుకుంటున్నట్లు సమాచారం.

Read More »

అత్యంత విషమంగా ముషారఫ్‌ ఆరోగ్యం..

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ హెల్త్‌ కండిషన్‌ ఏమాత్రం బాగోలేదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిరోజులుగా దుబాయ్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమించినట్లు హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ముషారఫ్‌కు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌ ఆర్మీలో చేరి అంచెలంచెలుగా ముషారఫ్‌ ఎదిగారు. ఆ తర్వాత ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు.

Read More »

ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయితే రాష్ట్రపతిగా వెంకయ్య?

దేశంలో రాష్ట్రపతి ఎన్నిక సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులగా ఎవరుంటారు? ఉత్తరాది వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటారా? దక్షిణాదికి ఈసారి అవకాశం దక్కుతుందా? ఏ వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రథమ పౌరుడు అవుతారు అనే అంశాలపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై …

Read More »

ఘనంగా నయనతార -విఘ్నేష్‌ శివన్‌ పెళ్లి వేడుక.. తరలివచ్చిన తారాలోకం

ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్ వివాహం ఘనంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ హోటల్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం నయన్‌ మెడలో విఘ్నేష్‌ మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నటులు రజనీకాంత్‌, షారూక్‌ఖాన్‌ తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులకు వాళ్లంతా మ్యారేజ్‌ విషెస్‌ చెప్పారు. నయనతార-విఘ్నేష్‌ శివన్‌ …

Read More »

వాళ్లను కూడా మేజర్లగానే పరిగణించాలి: జూబ్లీహిల్స్‌ ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో మైనర్లను మేజర్లుగానే పరిగణించి శిక్షించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయంలో హైదరాబాద్‌ పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. మైనర్‌గా ఉన్న వ్యక్తులు  మేజర్‌లా క్రూరంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి పాల్పడితే వాళ్లను కూడా మేజర్‌గానే పరిగణించాలని.. జువైనల్‌గా చూడొద్దని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat