యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్ జరీన్ గెలుపుతో హైదరాబాద్‌లోని …
Read More »లవర్‌తో రాసలీలలు.. ఇంట్లోనే భర్తకు దొరికిపోయిన భార్య
లవర్‌తో ఓ జవాన్ భార్యకున్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ప్రియుడితో ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో అనుకోకుండా భర్త రావడంతో దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రహ్మత్‌నగర్ పరిధిలో జవాన్ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. ఉద్యోగ రీత్యా భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగంతో ఇద్దరు పిల్లలతో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో లవర్‌తో అదే ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలోనే భర్త ఇంటికి వచ్చాడు. …
Read More »లండన్‌లో ఆటో మొబైల్ ఇండస్ట్రీ లీడర్స్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. యునైటెడ్ కింగ్‌డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేటీఆర్ తెలిపారు. విదేశీ పెట్టుబడులకు …
Read More »రాజ్యసభ TRS అభ్యర్ధిగా రవిచంద్ర నామినేషన్ దాఖలు
తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైయ్యారు. అభ్యర్ధి వద్దిరాజు రవిచంద్రకు మంత్రి …
Read More »తెలంగాణలో మద్యం ధరలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. లిక్కర్‌పై 20 నుంచి 25 శాతం పెంచారు. వెయ్యి ఎంఎల్ లిక్కర్‌పై రూ. 120 పెంచడంతో.. ధర రూ. 495 నుంచి రూ. 615కు పెరిగింది. లిక్కర్ క్వార్టర్ సీసాపై రూ. 20 పెంచింది. అన్ని రకాల బీర్లపై రూ. 10 చొప్పున ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read More »కన్న కొడుకునే పెండ్లి చేసుకున్న మహిళ..
మానవ సంబంధాలు క్రమంగా మంటగలసి పోతున్నాయి. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడనే వార్తలు తరచూ చదువుతూనే ఉన్నాం. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్నది. ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌నకు చెందిన బబ్లీ, ఇంద్రరామ్ భార్యాభర్తలు. ఇంద్రరామ్ ఆమెకు రెండో భర్త. వారిద్దరు 11 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, బబ్లీకి …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 4,25,89,841 మంది కోలుకోగా, 5,24,303 మంది మరణించారు. ఇంకా 15,419 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా, 2582 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Read More »ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో కొత్త వైరస్ -అమెరికాలో తొలి కేసు నమోదు
అమెరికాలో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ ఈ కేసును ద్రువీకరించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తి ఇటీవల కెనడాలో పర్యటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో చేర్పించారు. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మంకీపాక్స్‌ను సీరియస్ వైరస్ కేసుగా …
Read More »గ్యాస్ బండ మరింత భారం
పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటింది. తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్ ధర రూ.1003కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5, హైదరాబాద్‌లో …
Read More »నాకు చాలా గర్వంగా ఉంది -తమన్నా
తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అంటున్నది అందాల తార తమన్నా. ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ డెలిగేషన్‌లో తమన్నా పాల్గొంది. రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ…‘తొలిసారి కేన్స్‌కు రావడం ఉద్వేగంగా ఉంది. సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులంతా ఈ చిత్రోత్సవాలకు వస్తుంటారు.భారత్ తరుపున నేను వీటిలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై నడవటం గర్వంగా ఉంది’ అని చెప్పింది. …
Read More »