Home / SLIDER (page 531)

SLIDER

ఈనెల 25న యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 25న యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో పునర్నిర్మితమైన అనుబంధ శివాలయ ఉద్ఘాటనపర్వంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి 25 వరకు కొనసాగనుంది. అటు యాదాద్రి ఆలయంలో ఇతర నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు

Read More »

బాహుబలి కంటే పెద్ద సినిమా తీస్తా- బాలీవుడ్ క్రిటిక్ KRK

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్టు,శ్రియా ,సముద్రఖని,అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించగా వచ్చిన RRR, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన  KGF2  సినిమాలపై బాలీవుడ్ క్రిటిక్ KRK తీవ్ర విమర్శలు చేసిన సంగతి విధితమే. అయితే వీటికి మించి ఓ పెద్ద సినిమా …

Read More »

క్రిస్టియానో రొనాల్డో కొడుకు మృతి

 ప్రముఖ అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొడుకు మృతి చెందాడు. రొనాల్డో గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ కి కవలలు(ఒక పాప, ఒక బాబు) జన్మించారు. అందులో బాబు అనారోగ్యంతో మృతి చెందాడు.అయితే పాప బాగానే ఉంది. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఏ మోయలేని బాధ అని రొనాల్డో అన్నాడు. ఈ కష్ట సమయంలో తన ప్రైవసీని గౌరవించాలని అందర్నీ కోరాడు. …

Read More »

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

 దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,247 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న సోమవారం దేశంలో  వెలుగు చూసిన కేసులతో(2,183) పోల్చితే ఈ రోజు మంగళవారం కరోనాకేసుల సంఖ్య తగ్గింది. ఒకరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,860 ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,21,966కు చేరింది. కరోనా విజృంభిస్తుండటంతో హర్యాణా ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసింది.

Read More »

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని డిఒరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గౌరీబజార్ -రుద్రాపూర్ రోడ్డు మార్గంలోని ఇందూపూర్ కాళీ మందీర్ మలుపు వద్ద ఆర్ధరాత్రి SVU-బస్సు రెండు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే సంఘటనా స్థలంలోనే ఐదుగురు మరణించగా.. ఓ …

Read More »

సీఎం జగన్ కు షాకిచ్చిన YCP MLA

ఏపీ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆ పార్టీకే గట్టి షాకిచ్చారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో సదరు ఎమ్మెల్యే ఆధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తనకు మంత్రి పదవి దక్కకపోవడం గురించి మాట్లాడుతూ ఈ బోడి రాజకీయాలు నాకేందుకు..?. నాకు మంత్రి పదవి రాకుండా ఆధిష్టానం దెబ్బకొట్టింది. నేను కూడా …

Read More »

వర్క్‌ చేస్తుండగా పేలిన ల్యాప్‌టాప్‌.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి తీవ్రగాయాలు

లాప్‌ట్యాప్‌ ఛార్జింగ్‌లో ఉంచి వర్క్‌ చేసుకుంటుండగా అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా మేకలవారిపల్లెలో చోటుచేసుకుంది. సుమతి అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్‌ పెట్టి వర్క్‌ చేసుకుంటుండగా అది పేలి మంటలు వచ్చాయి. దీంతో సుమతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే కడపలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఇలా జరిగిందా? ల్యాప్‌ ట్యాప్‌ ఛార్జింగ్‌లో పెట్టి ఎక్కువసేపు అలా వర్క్‌ …

Read More »

మే 1 నుంచి విద్యుత్‌ కొరత లేకుండా చూస్తాం: పెద్దిరెడ్డి

దేశవ్యాప్తంగా విద్యుత్‌ కొరత ఉందని.. పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌ల్లోనూ ఇదే సమస్య ఉందని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా పవర్‌ను సప్లై చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 235 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందని.. అందుబాటులో మాత్రం 150 మిలియన్‌ యూనిట్లే ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచి కృష్ణపట్నం, ఎన్టీపీఎస్‌ ప్లాంట్ల ద్వారా మరో …

Read More »

కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. మూడు రోజులుగా రేప్‌

కోదాడలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడురోజులుగా అత్యాచారం చేశారు. కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆ అమ్మాయికి ఇచ్చారు. మూడు రోజుల తర్వాత సదరు యువతి తమ బంధువులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై యువతి పోలీసులకు కంప్లైంట్‌ చేసింది. దీంతో విచారణ చేపట్టిన కోదాడ పోలీసులు …

Read More »

మేం వద్దంటున్నామా? దమ్ముంటే అమలు చేయండి: బీజేపీపై కేటీఆర్‌ ఫైర్‌

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తామంటే తాము వద్దంటామా? అని ఎద్దేవా చేశారు. ఈనెల 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లపై కేటీఆర్‌సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat