గ్రీన్ టీ తాగడం వలన అనేక లాభాలున్నయంటున్నారు నిపుణులు.అయితే గ్రీన్ టీ తాగడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. త్వరగా బరువు తగ్గుతారు క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
Read More »నాపై అవన్నీ పుఖార్లే
ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తగ్గిన వెంటనే నాగార్జున ‘బంగార్రాజు’ ప్రాజెక్టును లాంఛ్ చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో పాయల్ రాజ్పుత్ కనిపించబోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పాయల్.. ‘అవన్నీ పుకార్లే. నేను ఎలాంటి ఐటెంసాంగ్ చేయడం లేదు’ అని తెలిపింది. కాగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read More »మెగాస్టార్ తొలి అడుగు
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో… మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నిన్న సోమవారం ప్రారంభమైంది. కర్ణాటక చింతామణి ప్రాంతంలో దాన్ని ఓపెన్ చేశారు. అఖిల భారత చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ దాన్ని ప్రారంభించగా.. మెగాస్టార్ చిరు స్వయంగా అతడికి అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ లను నెలకొల్పనున్నారు.
Read More »కరోనా కట్టడీపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో కరోనా థర్డ్ వేవు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు చెప్పారు. బ్లాక్ ఫంగస్కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో 150, ENTలో 250 బెడ్లు ఉన్నట్లు తెలిపారు.
Read More »తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 21 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,56,320కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,146 మంది మరణించారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,13,968కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 424 నమోదయ్యాయి.
Read More »ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.
Read More »లాక్డౌన్ సడలింపుల దిశగా అడుగులు
మహారాష్ట్రలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతుండటంతో లాక్డౌన్ సడలింపుల దిశగా ఆ రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. జూన్ 30 నాటికి అన్లాక్ ప్రక్రియ పూర్తవుతుందని, అయితే ఎప్పటి నుంచి అన్లాక్ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. మొత్తం నాలుగు దశల్లో అన్లాక్ అమలు చేయనున్నట్లు చెప్పారు.
Read More »హాయిగా నిద్రపోవాలంటే
హాయిగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగండి రాత్రిపూట టీ, కాఫీ, ఆల్కహాల్ తీసుకోకండి రాత్రి భోజనం మితంగా తినండి త్వరగా జీర్ణంకాని పదార్థాలు తీసుకోకండి రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రపోండి బెడ్రూంలో తక్కువ కాంతి ఉండేలా చూసుకోండి నిద్రకు ముందు ఫోన్ అస్సలు వాడకండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి రోజూ యోగా, ధ్యానం, వ్యాయామం చేయండి
Read More »రష్మిక పిలుపు
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా ధైర్యంగా ఉండాలని హీరోయిన్ రష్మిక ఓ వీడియో ట్వీట్ చేసింది. ‘ రోజు రోజుకు విజృంభిస్తోన్న కరోనా సవాల్ విసురుతోంది. ఈ సమయంలో మనం సానుకూలంగా ఆలోచించాలి. ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం. ప్రజల్లో ధైర్యం నింపడానికి వచ్చే వారం నుంచి మన పరిసరాల్లోని కొవిడ్ హీరోలను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. మీ ముఖాల్లో చిరునవ్వు కోసం ఈ చిన్ని ప్రయత్నం’ అని …
Read More »రేపటి నుండి FB,Twitter,Instagram,Whatsapp పని చేయవా..?
ఇండియాలో రేపట్నుంచి FB, ట్విట్టర్, ఇన్స్టాలు బ్లాక్ కాబోతున్నాయని కొన్ని ప్రభుత్వ వర్గాల సమాచారం. డిజిటల్ కంటెట్స్పై కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఫిర్యాదుల పరిష్కారానికి ఫ్రేమ్వర్క్ రూల్స్తో పాటు కొత్త నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి. FEBలోనే వీటితోపాటు న్యూస్ సైట్స్, OTTల కోసం కేంద్రం రూల్స్ విడుదల చేసి.. మే 25 వరకు అమలు చేసుకునేలా గడువిచ్చింది. ఇప్పటివరకు ‘కూ ‘సైట్ మాత్రమే వీటిని పాటించింది.
Read More »