తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,015 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,56,344 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 1,920కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 83,153 టెస్టులు చేశారు. 1,920 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే 100కేసులు పెరిగాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 417 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,496 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
Read More »సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని కేసీఆర్.. లాలూతో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని లాలూ కోరినట్లు సమాచారం. కేసీఆర్ పాలనా అనుభవం దేశానికి అవసరముందని లాలూ అన్నట్లు తెలిసింది.
Read More »ఉస్మానియా వైద్యులకు మంత్రి హరీష్ రావు అభినందనలు..
ఉస్మానియా వైద్యులను ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు. క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందిస్తున్న సేవల పట్ల, ఆర్థో శస్త్ర చికిత్సల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా సూపరింటెండ్ డాక్టర్ నాగేందర్, కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ ఇమాముద్దిన్, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం హెడ్ జి రమేష్ సోమవారం అరణ్య భవన్ లో మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా ఉస్మానియాలో …
Read More »తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులతో పోలిస్తే కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,673 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. నిన్న 2,606, మొన్న 2,295 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా గత 24 గంటల్లో ఒకరు మృతి చెందగా మరో 330 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ …
Read More »GHMCలో కొత్తగా 1165 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 1165 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,54,287 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. ‘ఒమిక్రాన్’ వేరియంట్ నేపథ్యంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »తెలంగాణకు అస్సాం సీఎం హిమాంత బిస్వా
తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం రాగా.. ఆదివారం అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలకనున్నారు. అస్సాం సీఎం బండి సంజయ్‌తో కలసి రోడ్డు మార్గంలో వరంగల్‌కు బయలుదేరతారు. మధ్యహాన్నం 12గంలకు ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై బండి సంజయ్‌తో కలసి హిమాంత …
Read More »GHMCలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
కొవిడ్ శరవేగంగా నగరాన్ని చుట్టేస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో వచ్చిన మొత్తం కేసుల కంటే ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం రోజుకు సగటున 576 వరకు కేసులు నమోదయితే, శనివారం ఒక్కరోజే 1,583 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన ఎనిమిది రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 6,610 మందికి వైరస్ సోకింది. …
Read More »మీ కేంద్రమంత్రులే మా రాష్ట్రాన్ని మెచ్చుకున్నారు-మంత్రి హారీష్ రావు
‘‘మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ నరహంతకుడు. పట్టపగలే ఆ రాష్ట్రంలో ఆరుగురు రైతులను కాల్చి చంపించిన చరిత్ర ఆయనది. ప్రభుత్వ ఉద్యోగాలను అంగట్లో అమ్ముకున్నారనే ఆరోపణలు ఆయన కుటుంబసభ్యులపై ఉన్నా యి. అవినీతి ఊబిలో మునిగి దొడ్డి దారిన ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిన ఘనత ఆయనది. అలాంటి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి వచ్చి సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు. ఏదిబడితే అది మాట్లాడొద్దు. ఇక్కడి అభివృద్ధిని …
Read More »TRS MLA ఇంట్లో అగ్నిప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాద సంఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలోని కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ రోజు శనివారం తెల్లవారుజామున ఇంట్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే భార్య సరోజకు స్వల్ప …
Read More »