Home / TELANGANA (page 406)

TELANGANA

తెలంగాణలో కరోనా విలయ తాండవం

తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా  క‌రోనా కేసులు రోజురోజుకు అధిక‌మ‌వుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 4446 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా మ‌రో 12 మంది బాధితులు మ‌ర‌ణించారు. 1414 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3.46 ల‌క్ష‌ల‌కు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైర‌స్‌వ‌ల్ల మ‌ర‌ణించ‌గా, మ‌రో 3.11 లక్ష‌ల మంది డిశ్చార్జీ అయ్యారు. …

Read More »

వివేక్ కోటి మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ జోగినపల్లి

ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, తమిళ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న వివేక్.. ఆ సంకల్పంలో భాగంగా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం …

Read More »

సూర్యాపేటలో ఫిక్లర్ ట్రీట్ మెంట్ ప్లాంట్

సూర్యాపేటలో ఎఫ్.ఎస్. టి.పి(ఫికల్ సర్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) నిర్మాణం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. అందుకు అవసరమైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని మున్సిపాలిటికి బదలాయించాలని ఆయన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ని ఆదేశించారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి ఇమాంపేట లో స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ లతో …

Read More »

సాగ‌ర్ ఉప ఎన్నిక‌‌.. ఇబ్ర‌హీంపేటలో ఓటు వేసిన నోముల భ‌గ‌త్

నాగార్జునసాగ‌ర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. టీఆర్ఎస్ ‌పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కుటుంబ స‌మేతంగా ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్ర‌హీంపేట‌లో ఓటు వేశారు. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్‌ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. క‌రోనా బాధితుల‌కు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 41 మంది అభ్య‌ర్థులు …

Read More »

క‌ష్టంలో తోడున్న‌ప్పుడే మాన‌వ‌జ‌న్మ‌కు సార్థ‌క‌త : ‌మంత్రి కేటీఆర్

సాటి మ‌నిషి క‌ష్టం, సాటి మ‌నిషి బాధ అర్థం చేసుకుని వారి క‌ష్టంలో తోడున్న‌ప్పుడే మానవ జ‌న్మ‌కు సార్థ‌క‌త ఉంటుంద‌ని దివ్యాంగుల‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాట సీఎం కేసీఆర్ త‌మ‌కు ఎప్పుడూ చెప్తుంటారు. పేద‌రికంలో ఉండే పేద‌లు కానీ, ఇత‌ర శారీర‌క‌మైన ఇబ్బందులు ఉండే దివ్యాంగుల‌కు బాస‌ట‌గా, ఆస‌రాగా నిల‌బ‌డాల‌న్న‌దే టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ముఖ్య ఉద్దేశ‌మ‌ని కేటీఆర్ ఉద్ఘాటించారు. మీ ముఖాల్లో చిరున‌వ్వును చూసిప్పుడే త‌మ‌కు …

Read More »

తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,840 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇందులో 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 3,09,594 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 9 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,797కి చేరింది.

Read More »

జీహెచ్ఎంసీ పరిధిలో 505 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలో   గడచిన 24 గంటల్లో మరో 505 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 88, 812కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెదముత్తేవికి చెందిన కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారు. నిమ్స్ డైరెక్టర్గా పని చేశారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Read More »

మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి చెందారు.   సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వరంగల్ జిల్లా ములుగు (మం) జగ్గన్నపేటలో జన్మించిన ఆయన తెలంగాణ రాష్ట్ర  టూరిజం& సాంస్కృతికశాఖకు తొలిమంత్రిగా సేవలందించారు. దివంగత మాజీ సీఎం,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్   కేబినెట్లోనూ గిరిజనశాఖ మంత్రిగా పనిచేశారు. ములుగు నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా, 2సార్లు ఎంపీగా గెలిచారు. కరోనాకు చికిత్స …

Read More »

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు

తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. రాష్ట్రంలో కూడా పబ్లిక్ పరీక్షల నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat