విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రప్రభుత్వం కోరిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆందోళన తెలుపుతూ లేఖ …
Read More »మంత్రి కేటీఆర్‌కు రూ.2 లక్షల చెక్కు అందజేత
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాని ఎదుర్కోవడంలో చేస్తున్న కృషికి తమ వంతు బాధ్యతగా సాయంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ మందడి లక్ష్మీనరసింహ రెడ్డి ఇటీవల తనకు అందించిన రూ.2 లక్షల విరాళం చెక్కుని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తో కలిసి మాసబ్ ట్యాంక్ లోని MA & UD కార్యాలయం లో బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక, …
Read More »సీతమ్మసాగర్ ప్రాజెక్టులో మరో ముందడుగు..!!
సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం కోసం 27.9 హెక్టార్ల (68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదల శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదుల ప్రాజెక్టుకు నిరంతర నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మ సాగర్ పేరుతో బ్యారేజి నిర్మాణం తలపెట్టింది. దీనికోసం ములుగు జిల్లాలో ఏటూరు నాగారం, వెంకటాపురం అటవీ డివిజన్ల పరిధిలో అటవీ భూమి …
Read More »సీఎం కేసీఆర్ కు అందించిన రైతు కేంద్రె బాలాజి..!!
తెలంగాణలో తొలిసారి ఆపిల్ పండ్లు పండించిన కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజి తొలి కాతను ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామలో 2 ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగుచేసినట్లు బాలాజీ …
Read More »తెలంగాణలో మందుబాబులకు శుభవార్త…!!
తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో ఇప్పటివరకూ సాయంత్రం 6 వరకూ మాత్రమే వైన్స్ తెరిచి ఉండేవి. ఇకపై నుంచి.. తెలంగాణలో రాత్రి 8 గంటల వరకూ వైన్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. లాక్‌డౌన్ 5.0ను కేంద్రం విధించినప్పటికీ.. ఆంక్షలను కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. మద్యం షాపులతో పాటు దాదాపు అన్ని షాపులు కంటైన్మెంట్ జోన్లలో తప్ప …
Read More »ఉద్యమం లాగా పరిశుభ్రత, పారిశుద్ధ్యం కార్యక్రమంలో పాల్గొనాలి..!!
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లో ఉద్యమం లాగా పాల్గొనాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 1 నుండి 8వ తేదీ వరకు నిర్వహించు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉద్యమ స్ఫూర్తి …
Read More »స్వేచ్చ లభించిన రోజు ఇది..మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ దినంగా నిలబడి పోయింది. నిజాం ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో పరాయి పాలనలో మగ్గి పోయిన తెలంగాణ ప్రజలకు జూన్ 2 నుండి స్వరాష్ట్రంలో సుపరిపాలన అందుబాటులోకీవచ్చిన సుదినం. వచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో యావత్ భారతదేశంలోనే …
Read More »తెలంగాణ మార్గదర్శి
దార్శనికత, ఘన సంకల్ప దీక్షల కలనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్న తెలంగాణ నమూనా- దేశానికే దిక్సూచి కాగల సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరిస్తోంది. పండిన పూటా పండగ చేసుకోలేని దండగమారి సేద్యం బడుగు రైతుల బతుకులతో మృత్యు క్రీడలాడటాన్ని ఓ రైతుగా అవలోకించి, ముఖ్యమంత్రిగా ఆలోచించి, అవరోధాల్ని అధిగమించి చేపట్టిన చర్యలు- దేశ ధాన్యాగారంగా తెలంగాణను సువ్యవస్థీకరించాయి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాంకేతిక అద్భుతమనదగ్గ ప్రాజెక్టులతో బీడు …
Read More »బహరేన్ దేశంలో తెలంగాణ యువకుడి మృతదేహం స్వగ్రామానికి తరలించిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్
బహరేన్లో గుండె పోటు తో మరణించిన తెలంగాణ బిడ్డ ఎడ్ల గంగరాజాం మృతదేహాన్ని లాక్ డౌన్ లోను స్వగ్రామానికి పంపిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ . పొట్టకూటి కోసం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం అరబ్ దేశం బెహ్రైన్ లో ప్రైవేట్ కంపెనీలో చేరాడు. దురదృష్టవశాత్తు 14 ఏప్రిల్ 2020 తేదీన గుండె పోటుతో రూములో మృతి …
Read More »మంత్రి కేటీఆర్ పిలుపు
సీజనల్ వ్యాధుల నివారణకోసం పురపాలకశాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ ను ఆదివారం పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు. తన నివాసంలో ఉన్న పూల కుండీల్లో పేరుకుపోయిన నీటిని తొలిగించారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నీరు పేరుకుపోయిందా అని పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారుల సలహామేరకు యాంటీ లార్వా మందులను చల్లారు. ప్రస్తుతం ప్రజలందరికీ ఆరోగ్యంపైన ప్రత్యేక స్పృహ …
Read More »