దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాకోచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన రాష్ట్రపతి భవన్లోని విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా బుధవారం …
Read More »అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత
అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ శివారులో సారంగాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ… ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని …
Read More »భువనగిరి పట్టణ పురపాలక పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ పాలకవర్గం సమావేశానికి హాజరయ్యారు. భువనగిరిలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న తీరుపైన అధికారులను పాలకవర్గ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున పార్టీలకతీతంగా అందరూ కలిసి సమన్వయంతో పట్టణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మంత్రి కోరారు. భువనగిరి పట్టణ సమగ్రాభివృద్ధికి …
Read More »బ్రేకింగ్ న్యూస్..కూకట్ పల్లిలో భారీ పేలుడు..ఒకరు మృతి!
హైదరాబాద్ లోని కూకట్ పల్లి సమీపంలో ఉన్న ఇండియన్ డినోనేటర్స్ లిమిటెడ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో శర్మ అనే వ్యక్తి మ్రితి చెందగా మరికొంతమందిని గాయాలు అయ్యాయి. వారిని దగ్గరలో ఉన్న ఆశుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ కంపెనీలో తరుచూ ఇలాంటి పేలుళ్లు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి …
Read More »తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వకపోతే రూ.500 జరిమానా
ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది.! మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ! మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత భావం ఉండాలి. జరిమానా వేయకపోతే భయం ఉండదు.! ప్రతి ఇంటింటికీ తడి, పొడి రెండు చెత్త బుట్టలు ఇస్తున్నాం.! ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇవ్వకపోతే జరిమానా వేయక తప్పదు.! ఖాళీ ప్లాట్ స్థలంలో చెత్త వేస్తే …
Read More »ట్రంప్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసా..?
అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసారు. ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం …
Read More »నాయకులు ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు
ఎక్కడైన సరే ‘నాయకులు ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు.. కానీ, మేము ఓట్లు అయిపోయినంకా సేవ చేద్దామని మీ ముందుకు వచ్చాం.. పట్టణాలను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ‘పట్టణ ప్రగతి’ని ప్రారంభించారు.. సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవా లి.. రెండు నెలల తర్వాత మళ్లీ వార్డుల్లో పర్యటిస్తా’నని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని 15వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ జయమ్మ, కలెక్టర్ …
Read More »వెలుగులోకి వచ్చిన రేవంత్ భూదందా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి భూదందా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలోని భూమి.. ఎకరం ధర దాదాపు రూ.పాతికకోట్లు. మొత్తం ఏడెకరాల భూమి విలువ రూ.150 కోట్లపైమాటే. ఇంతవిలువైన భూమికి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు ఎవరనే వివరాలు సక్రమంగా లేకపోవడాన్ని అసరా చేసుకుని మల్కాజిగిరి ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి …
Read More »వృద్ధురాలికి మంత్రి కేటీఆర్ భరోసా
దేవరకొండలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి విదితమే. ఇందులో భాగంగారేకుల ఇల్లుతో తాను పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టిన ఓ వృద్ధురాలికి ఇంటికి చెత్తు (పై కప్పు) వేయిస్తానని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పట్టణప్రగతిలో భాగంగా దేవరకొండ పట్టణంలోని తొమ్మిదోవార్డులో పర్యటించిన మంత్రికి, నాగమ్మ అనే వృద్ధురాలికి మధ్య జరిగిన సంభాషణ ఇదీ.. కేటీఆర్: అవ్వా నీ పేరేమిటి? వృద్ధురాలు: పానగంటి …
Read More »గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు (67) గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్ చింతల్‌బస్తీలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఛాతీనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబీకులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఆయనకు భార్య మధురవేణి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ …
Read More »