తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలో అల్గునూరు వద్ద జాతీయ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడక్కడే దుర్మరణం చెందాడు. అయితే ఈ ప్రమాదాన్ని వంతెనపై నుంచి పరిశీలిస్తున్న కానిస్టేబుల్ కాలు జారి కింద పడ్డాడు. దీంతో అతడికి …
Read More »రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలు
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం ఉదయం రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరణ చేసిన ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్, రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలను జడ్పి చైర్మన్ రోజా శర్మ ,మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనరసు గారితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు. ** అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులకు అందుతున్న …
Read More »ఖమ్మంలో విషాదం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గుంపెల్లగూడెంలో పెను విషాదం నెలకొన్నది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రికొడుకులు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు కుమారుడు ఆ చెరువు దగ్గరకెళ్లాడు. అతడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. అతడ్ని కాపాడే ప్రయత్నంలో తండ్రి కూడా మునిగిపోయాడు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.చనిపోయిన వారిని సత్యనారాయణ(48), భరత్(14)గా పోలీసులు గుర్తించారు.
Read More »పెళ్ళి బారాత్ లో వరుడు మృతి
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో పెద్ద విషాదం నెలకొన్నది. పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో నివాసముంటున్న గణేష్ శుక్రవారం పెళ్ళి చేసుకున్నాడు. దీనిలో భాగంగా రాత్రి బారాత్ నిర్వహించారు. బారాత్ లో భాగంగా పెద్ద పెద్ద సౌండ్స్ తో డీజేను కూడా ఏర్పాటు చేశారు. బారాత్ లో డాన్స్ చేస్తున్న గణేష్ డీజే సౌండ్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే …
Read More »కొనసాగుతున్న సహకార ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుండి సహకార ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ పోలింగ్ మధ్యాహ్నాం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. అనంతరం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 905సహకార సంఘాలకు 157సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా 747 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 6,248డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు పన్నెండు లక్షల మంది …
Read More »రేపు తెలంగాణ మంత్రి వర్గం భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశం ఏర్పాట్లపై సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రేపు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరగనున్న ఈ క్యాబినేట్లో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవిన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలపై మంత్రి వర్గం …
Read More »పెద్ద మనసును చాటుకున్న మంత్రి
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి -ఆర్నికొండ రోడ్డు మార్గంలో జరిగిన ఒక ప్రమాదంలో భూమయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భూమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమయ్యను గమనించాడు. అంతే కారును ఆపించి మరి తన దగ్గర ఉన్న నీళ్లను తాగించాడు. తన కాన్వాయ్లోని ఒక …
Read More »21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలి..మంత్రి కేటీఆర్
రూపాయి లంచం లేకుండా, 21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. అనుమతి ఇవ్వకపోతే అందుకు గల కారణం చెప్పాలన్నారు. ఇవాళ మంత్రి.. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో అదనపు కలెక్టర్లకు నూతన పురపాలకు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్ బీ పాస్‌పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్ …
Read More »సీఎం కేసీఆర్ పుట్టినరోజున నగర వ్యాప్తంగా హరితహారం..మేయర్
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున మొక్కలు నాటి, సీఎంకు పుట్టినరోజు కానుక ఇవ్వాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. నగరంలోని అన్ని …
Read More »ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి..!!
ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలను సొంత ప్రాంతానికి రప్పించేందుకు మంత్రి కే. తారకరామారావు చూపిన చొరవ ఫలించింది. ఇరాక్ లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో ఆక్కడ చిక్కుకొని కనీసం తాగేందుకు నీరు, తినేందుకు తిండి, వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక నాలుగు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నామని మంత్రి శ్రీ కె.టి.రామారావు గారికి బాధితులు తెలిపారు. …
Read More »