లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని జూబ్లిహీల్స్ చెక్ పోస్టు వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి వస్తోన్న ఆటో బలంగా ఢీకొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో జయప్రకాష్ నారాయణ ప్రయాణిస్తోన్న కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే కారులోనే ఉన్న జేపీకి ఎలాంటీ ప్రమాదం జరగలేదు. …
Read More »సామూహిక వివాహమహోత్సవ కార్యక్రమంలో మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి నేతృత్వంలోని ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహా వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాగర్‌కర్నూల్ జెడ్పీ మైదానంలో కల్యాణ మహోత్సవం జరిగింది. ఒకే ముహూర్తంలో 165 జంటలు ఒక్కటయ్యాయి. 2012 నుంచి ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఎంపీ …
Read More »రెవెన్యూ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సత్వరసేవలు అందించేలా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 107 రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. ఒక్క రెవెన్యూలోనే ఇన్నిరకాల చట్టాలు అమల్లో ఉండటంతో ఆయా సమస్యలు వచ్చినప్పుడు ఏ చట్టం ద్వారా పరిశీలించి పరిష్కరించాలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్ట్(బీ)లో పేర్కొన్న భూ సమస్యలు చాలావరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సమస్యలకు తోడు రెవెన్యూ …
Read More »రేపు జర్నలిస్టులు గ్రీన్ ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడానికి రాష్ట్రంలోని జర్నలిస్టులు తరలిరావాలని మీడియా అకాడమీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పిలుపునిచ్చాయి. రేపు సోమవారం ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం …
Read More »ఉరితీయాల్సిందే.. వైసీపీ ఎమ్మెల్యే రోజా
ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా డిమాండ్ చేశారు. ఆడ పిల్లలపై చేయి వేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలన్నారు. బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రియాంక పేరెంట్స్ పట్ల వెటకారంగా మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మానవ హక్కుల సంఘాలు కూడా నేరస్థుల్ని శిక్షించే విధంగా ఫైట్ చేయాలన్నారు
Read More »మహిళలూ.. ‘హాక్-ఐ’ని ఇన్‌స్టాల్ చేసుకోండి
ఆపత్కాలంలో ఉన్న మహిళలు తక్షణ సాయం కోసం కొన్ని మొబైల్ నంబర్లను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వాటి వివరాలిలా ఉన్నాయి.. డయల్-100: ఈ నంబరుకు ఫోన్ చేస్తే.. కంట్రోల్ రూం సిబ్బంది వెంటనే ఫిర్యాదును నమోదు చేసుకుని, సంబంధిత పోలీసు సిబ్బందిని ఘటనాస్థలికి పంపుతారు. వాట్సాప్ ఫిర్యాదులకు: 9490616555(హైదరాబాద్), 9490617444(సైబరాబాద్), 9490617111(రాచకొండ). పోలీసులు 24 గంటలూ ఈ నంబర్లకు వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఔటర్‌పై: ఔటర్ …
Read More »తెలంగాణ దేశానికే ఆదర్శం..కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశంసించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల్లో నాటిన మొక్కలను సంరక్షించేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో శనివారం ప్రకాష్ జవదేకర్ అన్ని రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు …
Read More »నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారికి నా శుభాకాంక్షలు…మొదటి ట్రాన్సజెండర్ నర్స్ రక్షిక !
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 ను నర్సింగ్ ఇయర్ గా ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తo చేసిన భారతదేశ మొదటి ట్రాన్సజెండర్ నర్స్ రక్షిక. నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 7వ తేదీన రవీంద్రభారతిలో జరుపుతున్న 2020 నర్సింగ్ ఇయర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన సందేశాన్ని వీడియో రూపములో పంపడం జరిగింది.నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారికి రక్షిక అభినందనలు తెలిపారు.7వ తేదీన జరిగే కార్యక్రమం విజయవంతం కావాలి అని రక్షిత అక్షించారు …
Read More »చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం..మంత్రి హరీశ్‌రావు
చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చని.. చిరుధాన్యాలు మన ఆహారంలో భాగం కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఆధ్వర్యంలో నగరంలోని హెచ్‌ఐసీసీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. పల్స్ బాస్కెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిరు ధాన్యాల పంటల సాగు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సైతం చిరుధాన్యాల సాగు …
Read More »పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓ నిత్య విద్యార్థి..మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కామారెడ్డి బాన్సువాడలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి రూ.100కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ‘బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. బాన్సువాడలో 2వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నాం. స్పీకర్ పోచారం …
Read More »