సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సోమవారం కీలక ప్రకటన చేసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఇది కార్మికుల నైతిక విజయమని కార్మిక సంఘం నేత అశ్వత్ధామరెడ్డి ప్రకటించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మె విరమించినట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. రేపటి నుంచి ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలని జేఏసీ …
Read More »విద్యాప్రమాణాలు, నైపుణ్యాభివృద్ధిలో ముందంజలో తెలంగాణ
ముందంజవేస్తున్నదని, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో అమెరికా దేశం అలబామా రాష్ట్రంలోని ఆబర్న్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ -(FCRI) మధ్య విద్యాసంబంధ విషయాలపై పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. అరణ్య భవన్ లోని మంత్రి చాంబర్ లో ఆబర్న్ యూనివర్సిటీ డీన్ జానకి రాంరెడ్డి, ఎఫ్‌సీఆర్‌ఐ …
Read More »సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణ పడి ఉంటాం..!!
గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ లకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో 68.32 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం చారిత్రాత్మక విషయమని బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో వారు సోమవారం ఆయన నివాసంలో సమావేశమై సంతోషాన్ని పంచుకున్నారు. స్వాతంత్ర్య అనంతరం అనేక సంవత్సరాల నుంచి …
Read More »ఈ గవర్నెన్స్ లో తెలంగాణ టాప్..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమాభివృద్ధిలో పరుగులు పెడుతుంది. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పలు అవార్డులు వస్తోన్నాయి. అందులో భాగంగా మీసేవ,డిజిటల్ పేమెంట్ యాప్ -T వాలెట్ ద్వారా సేవలు అందిస్తూ ఈ గవర్నెన్స్ లో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం …
Read More »ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలలుగా ప్రభుత్వం కానీ ఆర్టీసీ యజమాన్యం కానీ జీతాలు ఇవ్వలేదు. దీనిపై ఆర్టీసీ సిబ్బంది,జాక్ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేని కారణంగా కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ …
Read More »మహాద్భుతంగా సంసిద్ధమవుతున్న యాదాద్రి పంచ నారసింహ క్షేత్రం..!
యాదాద్రి పంచనారసింహక్షేత్రం మహాద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ప్రధానాలయ ముఖమండపంలో కీలక పనులు ముగింపుదశకు చేరుకున్నాయి. గర్భాలయ ప్రధాన ద్వారం, ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠంతోపాటు ఇప్పటికే పూర్తయిన సప్తగోపురాలపై ఏర్పాటుచేసిన 58 కలశాలకు పసిడి సొబగులను తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా వీటిపై రాగి పలకలను అమర్చే పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనంతరం వీటికి బంగారు తాపడంచేస్తారు. గర్భగుడికి ఏర్పాటుచేసిన ప్రధాన ద్వారానికి కూడా రాగిపలకలపై బంగారు తాపడంచేసే పనులు …
Read More »కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతమే లక్ష్యం
ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాల అభివృద్ధి సంస్థ మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ IAS గారు కలిసి పాలేరు రిజర్వాయర్ లో రోయ్య పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్బంగా …
Read More »తెలంగాణలో గీతకార్మికుల సంక్షేమానికి పలు పథకాలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రకటించారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో నీరా, అనుబంధ ఉత్పత్తులు తయారు చేయడానికి సంబందిత శాఖాధికారులు మరియు గీత వృత్తిదారుల ప్రతినిధుల తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లో ఉన్నత స్థాయి …
Read More »మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు కపిల్ దేవ్ ఈ రోజు సోమవారం ఉదయం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి కేటీఆర్‌తో కపిల్ దేవ్ చర్చించారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు …
Read More »గ్రేటర్లో అమ్మాయిలూ జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే సమ్మె ప్రభావం కన్పించకుండా ఇటు ఆర్టీసీ యజమాన్యం,ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన.. ఎన్ని చర్యలు తీసుకున్న కానీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మాత్రం అక్కడక్కడ ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పాటు స్కూళ్లకు,కాలేజీలకెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా బస్సు అందక నగరంలో …
Read More »