తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా పనిచేస్తున్న యంగ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల్లో పనిచేయనున్నారు. డిప్యూటి కార్యదర్శిగా ఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్‌లో ఆమెను కేంద్రం డిప్యుటేషన్‌పై నియమించింది. ఆమ్రపాలి తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. వికారబాద్ సబ్ కలెక్టర్‌గా రంగారెడ్డి జిల్లా జెసిగా సేవలందించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత తెలంగాణలో ఆమ్రపాలి పదోన్నతిపై వరంగల్ అర్భన్ కలెక్టర్‌గానూ సేవలందించారు.
Read More »హుజూర్ నగర్ ఓటమికి బాధ్యత నాదే
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ రోజు మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని …
Read More »పొన్నాల లక్ష్మయ్యకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు భారీ ప్రమాదం తప్పింది. నిన్న సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాద ఘటన జరగడానికి ముందే కారులో నుంచి దిగి మాజీ మంత్రి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్ లోకి వెళ్ళారు. వాళ్లు లేనప్పుడు ఈ ఘటన …
Read More »హైదరాబాద్ ఐఐటీలో విషాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐఐటీలో విషాదం నెలకొన్నది. ఐఐటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మేడ్చల్ జిల్లా కుత్భుల్లా పూర్ కు చెందిన సిద్ధార్థ అనే విద్యార్థి ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహాత్యా యత్నం చేశాడు. భవనంపై నుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన సిద్ధార్థను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సిద్ధార్థ మృతి చెందాడు. అంతకుముందు సిద్ధార్థ తన …
Read More »ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నీరా స్టాల్స్..!!
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ‘నీరా’ అమ్మకాలకు త్వరలోనే శ్రీకారం చుడతామని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని టాంక్‌బండ్ పరిసరాల్లో ప్రయోగాత్మకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. నీరా పాలసీ, మార్గదర్శకాలను సోమవారం ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు నీరా పాలసీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని అన్నారు. గత 70 …
Read More »నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్..!!
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో మంజూరైన 36 లక్షల 29 వేల 500 విలువగల 139 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తన సిఫార్సు మేరకు నియోజకవర్గంలో 139మంది …
Read More »సీఎం కేసీఆర్ పై త్రిదండి చినజీయర్ స్వామి ప్రశంసల వర్షం..!!
సీఎం కేసీఆర్ పై త్రిదండి చినజీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమం తిరునక్షత్రోత్సవ వేడుకలతో పరవశించిపోయింది. సీఎం కేసీఆర్ దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చినజీయర్ స్వామి వారికి ఫలపుష్పాలు సమర్పించి మంగళాశాసనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి సత్యసంకల్ప గ్రంథాన్ని ముఖ్యమంత్రికి బహుకరించారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న …
Read More »పర్యావరణ పరంగా మన అప్రమత్తతే భవిష్యత్ తరాలకు శ్రీ రామరక్ష
తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా, పచ్చదనం పరంగా అవసరమైన జాతీయ సగటు 33 శాతానికి చేర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రుల కమిటీ వెల్లడించింది. అడవుల రక్షణ, పచ్చదనం పెంపుపై అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రోడ్లు, …
Read More »మేడారం జాతరపై మంత్రుల సమీక్ష.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు..!!
గతంలో ఎప్పుడూ జరగని రీతిలో, అత్యంత ఘనంగా, దేనికి కొరత లేకుండా, భక్తులు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఈసారి మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై నేడు హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడారం జాతరకు …
Read More »వచ్చే నెల 1 న MSME ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం.. ముఖ్య అతిధిగా హాజరుకానున్న మంత్రి కేటీఆర్
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ లో 438 ఎకరాలలో నెలకొల్పనున్న టీఎస్ ఐఐసి-టిఐఎఫ్-ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును నవంబర్ 1న ఉదయం 10 గంటలకు రాష్ట్ర పరిశ్రమల శాఖా మాత్యులు కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామికవేత్తలతో మంత్రి ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పారు. మంత్రి కేటీఆర్ కార్యక్రమం విజయవంతానికి ఏర్పాట్లపై అధికారులతో దండుమల్కాపూర్ టీఎస్ ఐఐసి-టిఐఎఫ్ …
Read More »