శ్రీనగర్ నిట్ లో చదువుతున్న 130 మంది తెలుగు విద్యార్ధులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేలా ఏర్పాట్లను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి న్యూడిల్లీ లోని తెలంగాణభవన్ అధికారులను ఆదేశించారు. జమ్ము కాశ్మీర్ లో నెలకొన్న పరిస్ధితుల నేపధ్యంలో నిట్ విద్యార్ధులు తాము రాష్ట్రానికి రావడానికి తగు సహాయం చేయాలని కె.తారకరామారావు ను కోరారని, వారు ఈ విషయాన్ని సి.యస్ దృష్టికి తీసుకువచ్చి తగు సహాయం అందించాలని కోరారు. …
Read More »వ్యవసాయ వర్సిటీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ప్రవేశాల కౌన్సిలింగ్‌కు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు రాజేంద్రనగర్‌లో కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్, బీవీఎస్‌సీ, ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీఎస్సీ హార్టీకల్చర్ కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహణ జరగనుంది. ఎంసెట్-2019 ర్యాంకు ఆధారంగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరగనున్నట్లు వర్సిటీ రిజిస్టార్ తెలిపారు.
Read More »శ్రీనగర్ నిట్ విద్యార్థులను కేటీఆర్ భరోసా
జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న ప్రస్థుత పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్ ఎన్‌ఐటీ క్యాంపస్‌ను విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో ఎటూ పాలుపోలేని పరిస్థితుల్లో భయాందోళనలకు గురైన విద్యార్థులు తమ గోడును ట్విట్టర్ ద్వారా టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తమ విద్యాసంస్థను మూసివేస్తుండటంతో తమను ఆదుకోవాలని ఏ సందర్భంగా కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. దీనితో వెంటనే …
Read More »‘ఆర్ట్ ఫర్ ఏ కాజ్’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఆర్ట్ ఫర్ ఏ కాజ్’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్‌ను ఎంపీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. వన్యప్రాణులే ఇతివృత్తంగా 11ఏళ్ల బాలుడు చిత్రలేఖనంతో అబ్బురపరిచాడు. సృజనాత్మకతతో బొమ్మలు గీసిన యువ చిత్రకారుడు ప్రణవ్‌ను ఎంపీ సంతోష్ అభినందించారు. పెయింటింగ్స్ …
Read More »వరిపోలంలో ఎమ్మెల్యే రేఖానాయక్
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో సాగు జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ముసురును సైతం లెక్కచేయకుండా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ పంచాయతీలోని చెర్లపల్లే గ్రామం మీదుగా వెళ్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ నాటేస్తున్న పొలం వద్ద ఆగారు. మహిళా కూలీలను పలకరించిన ఎమ్మెల్యే వారితో కలిసి పొలంలోకి దిగి కాసేపు నాటేశారు.
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను ముఖ్యమంత్రి కోరారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ …
Read More »మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి.. కొప్పుల
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. పలువురు కేంద్రమంత్రులను కలిసిన పలు అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణలో గురుకుల పాఠశాలల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. పెద్దపల్లిలో కేంద్రీయ విద్యాలయం, జగిత్యాలలో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.. అటు రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణంలో …
Read More »వరంగల్ సమగ్ర అభివృద్ధికి వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041
వరంగల్ మహా నగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త మాస్టర్ ప్లాన్ ఉంటుందని చెప్పారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041ఆమోదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. …
Read More »మోడల్ ఈద్గాగా చిలకలగూడ ఈద్గా
తెలంగాణా రాష్ట్రంలో సికింద్రాబాద నియోజగవర్గంలో చిలకలగూడ ఈద్గాను మోడల్ ఈద్గాగా తీర్చిదిద్దామని, ఆ తరహాలోనే శేశాపహాడ్ ఈద్గా ను అభివృధి చేయాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి పద్మారావు గౌడ్ శుక్రవారం శేశాపహాడ్ ఈద్గా ను సందర్శించారు. ఈద్గా ప్రహరి గోడ పాక్షికంగా కూలిపోవడంతో అపయకరంగా మారిన అంశాన్ని గుర్తించి వెంటనే పునర్నిర్మాణం, మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను పద్మారావు గౌడ్ …
Read More »సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీ… డాక్టర్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం..!
సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి డాక్టర్ల తీరుపై ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిని కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిన్న వైద్యం అందక ఒక గర్భిణీ స్త్రీ చనిపోయిన ఘటనపై కేటీఆర్ డాక్టర్లను ప్రశ్నించారు. వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా …
Read More »