తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి చేరుకున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తల్లి తారకమ్మ జులై 22వ తేదీన స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఈ రోజు తారకమ్మ దశదినకర్మ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తారకమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నిరంజన్‌రెడ్డిని పరామర్శించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ నాయకులు, జిల్లాకు చెందిన అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Read More »జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు…విద్యుత్త్పత్తి ప్రారంభం…!
వనపర్తి జిల్లా, అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టులో 22 గేట్స్ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఇన్ ఫ్లో :1.62.834 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో : 1.67.370 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీట్టి నిల్వ : 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459 టీఎంసీలు ఉంది. ఇక …
Read More »కేటీఆర్ ను కలిసిన సందీప్.. సంతోషానికి అవధులు లేవు..!!
రామన్నా అంటే నేనున్నా అంటూ భరోసా ఇచ్చే యువ నాయకులు కేటీఆర్. కొన్నాళ్ళ క్రితం ట్విట్టర్ ద్వారా తనను కలవాలని ఉంది అంటూ ట్వీట్ చేసిన దివ్యాంగుడు నాయిని సందీప్ రెడ్డిని ఇవ్వాళ కలిశారు.పుట్టుకతోనే శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయని సందీప్ అతి కష్టం మీద కంప్యూటర్, మొబైల్ మీద టైప్ చేయడం నేర్చుకున్నాడు. వయసు 26 ఏళ్లు వచ్చినా ఇంకా చాలా విషయాల్లో చిన్న పిల్లవాడి మనస్తత్వమే. కొన్ని …
Read More »మహిళల సంక్షేమం కోసమే స్త్రీ నిధి.. మంత్రి ఎర్రబెల్లి
మహిళల సంక్షేమం కోసమే స్త్రీనిధి, మెప్మా, సెర్ప్‌లు ఏర్పాటు అయ్యాయన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్త్రీ నిధి కరపత్రాన్ని విడుదల చేసిన ఎర్రబెల్లి ఆపదలో ఉన్న పేద మహిళలను ఆదుకోవడమే స్త్రీనిధి ఉద్దేశ్యమన్నారు. టెక్స్‌టైల్ పార్క్ విషయంలో తనపై వచ్చిన కథనాలు తప్పు అన్నారు ఎర్రబెల్లి. తాను ఎవరిని బెదిరంచలేదని….. పనులు ఆలస్యంగా జరుగుతున్నందున అక్కడికివెళ్లి అడిగానని చెప్పారు. ఒక్కరి వల్ల మొత్తం పని …
Read More »సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!!
తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 – 20 ఆర్థిక సంవత్సరంలో (ఇప్పటి వరకు) ఆత్మహత్య చేసుకున్న 243 మంది రైతులకు ఈ పరిహారం అందించడానికి రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.6లక్షల పరిహారం ఇవ్వనుంది. మొత్తం రూ.14.58 కోట్ల పరిహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. దీంతో రెవిన్యూ శాఖ …
Read More »ఆగస్టు 10 నాటికి సభ్యత్వం పూర్తి చేయాలి.. కేటీఆర్
రాజధానిలో పార్టీ సభ్యత్వంపైన టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి, చెవెళ్ల నియోజకవర్గాల వారీగా ఈ మేరకు సమీక్షా సమావేశాలను తెలంగాణ భవన్ లో నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభ్యత్వం జరుగుతున్న తీరుని కేటీఆర్ సమీక్షించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు 50 వేల …
Read More »ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఔదార్యం..
ఆపదలో ఉన్న వారిని ఆదుకుని భరోసా ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఇటీవల రోడ్డుప్రమాదానికి గురై యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చెరుకుపల్లి రాజిరెడ్డి అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(LOC) ద్వారా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. దీంతో పోచంపల్లికి రాజిరెడ్డి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.
Read More »సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ…!
ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సన్నిహితంగా మెలుగుతూ, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలో …
Read More »సౌదీ అరేబియా నుంచి ఓ మహిళ ట్వీట్… స్పందించిన కేటీఆర్…!
ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడిలా నిలుస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రతి రోజు ట్విట్టర్‌లో కేటీఆర్ సాయం కోరుతూ ఎన్నో ట్వీట్లు వస్తుంటాయి. వాటికి కేటీఆర్ వెంటనే స్పందిస్తూ వారికి కావల్సిన సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా సౌదీ అరేబియా నుంచి ఓ మహిళ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. మా నాన్న చనిపోయారు. ఇండియా రావాలనుంది. నాకు మీ సహకారం కావాలి’అంటూ రంగారెడ్డి జిల్లా కర్మన్‌ఘాట్‌లోని భూపే ష్‌గుప్తా నగర్‌కు …
Read More »కొత్త అసెంబ్లీ కడితే తప్పేంటీ…పిటీషనర్లకు హైకోర్ట్ చివాట్లు…!
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని ఎర్రమంజిల్‌లో నిర్మిస్తుండడంతో పురాతనమైన ఎర్రమంజిల్ బిల్డింగ్‌ను ప్రభుత్వం కూల్చివేస్తుందంటూ ప్రతిపక్షాలు రాగాలు మొదలుపెట్టాయి. చారిత్రక భవనాలను కూల్చి వేతపై కొందరు హైకోర్ట్‌కు వెళ్లగా ఈ రోజు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటీషనర్లకు న్యాయమూర్తుల బెంచ్ కొత్త అసెంబ్లీని ఎందుకు …
Read More »