తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని రాజ్ భవన్ కు చేరుకోగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ …
Read More »అవతరణ దినోత్సవం..ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే డీఏను 3.144 శాతం పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న డీఏ 27.248 నుంచి 30.392 శాతానికి పెరగనుంది. దీంతో పాటు కరువు భత్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల జీతంతో కలిపి …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నరసింహన్
గవర్నర్ నరసింహన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతిఒక్క లబ్దిదారుడికి అందేలా చూడాలని కోరారు.బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.
Read More »ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు మరియు న్యూ సౌత్ వేల్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి పిన్నమ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆస్ట్రేలియాలోని అని ప్రధాన నగరాలలో తెరాస ఆస్ట్రేలియా అద్వర్యం లోనిర్వహించారు. రాజేష్ రాపోలు, ప్రవీణ్ పిన్నమ మాట్లాడుతూ ఉద్యమ నేపధ్యాన్నీ , స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ …
Read More »సుజనా చౌదరిపై సీబీఐ అధికారులు ఆటాక్.. ఏకకాలంలో మూడుచోట్ల సోదాలు
కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి నివాసంతో పాటు, కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారులు హైదరాబాదులోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సుజనా చౌదరి కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో మొత్తం మూడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రాంకింగ్ ప్రాడ్ సెల్ టీమ్ సభ్యులు కూడా సోదాలు చేశారు. బెస్ట్ అండ్ కాంప్టన్ పేరుతో మాజీ సీబీఐ …
Read More »ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం..సెల్ఫీ రూపంలో!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీలు తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్ వద్ద ముగ్గురు యువకులు సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మృతులు అవినాశ్ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలకట్టు గ్రామస్తులుగా గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరి మృతదేహాన్ని వెలికి బయటికి తీశారు. మరో …
Read More »కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి..!!
ప్రధాని మోదీ తన మంత్రి వర్గంలో అమిత్ షాకు హోంమంత్రిత్వ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా గురువారం ప్రమాణ స్వీకారం చేసి.. శనివారం కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు అయన పలు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా శనివారం బాధ్యతలు …
Read More »ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. సీఎం కేసీఆర్, కేటీఆర్ షెడ్యూల్ ఇదే..!!
జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో సుమారు ఐదువేల మంది కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా మొదట అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. 9 గంటలకు పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.30లకు సీఎస్ ఆధ్వర్యంలో ‘ఎట్ హోం’ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా.. …
Read More »ఓ ఎంపీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారితే ఎట్టుంటదో తెలుసా ?
హైదరాబాద్ లో ఒక ఎంపీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారారు.ఈ ఫీట్ చేసిన వ్యక్తి మరెవ్వరో కాదు ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.శుక్రవారం సాయంత్రం పాతబస్తీలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.అదేసమయంలో అటునుండి అసదుద్దీన్ వెళ్తున్నారు.ఆ ట్రాఫిక్ చూసిన ఆయన తానే స్వయంగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌లా మొత్తం క్లియర్ చేసారు.ఆయనకు తోడుగా అక్కడ ప్రజలు కూడా సాయం చేసారు.అసలే రంజాన్ మాసం..దీంతో రోడ్ల మీద కూడా దుకాణాలు పెట్టుకుంటున్నారు.ఈమేరకు ఈ …
Read More »వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో కేటీఆర్‌కు ఆహ్వానం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సుకు హాజరుకావాల్సిందిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల విషయాలపై ఇందులో చర్చించనున్నట్టు తెలిపింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ ప్రధానాంశంగా …
Read More »