కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఇవాళ బేగంపేట కేటీఆర్ కార్యలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర సంవత్సరాలుగా అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని.. కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ ప్రశంసించారు. అంతేకాకుండా తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి .. టీఆరెస్ తిరిగి అధికారంలోకి వచ్చినందుకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. Ms Nicole …
Read More »హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు..సీఎం
హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని సమస్యలుత్పన్నమవుతాయి, అలాంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి, పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి. హైదరాబాద్ వైపే అందరూ ఆకర్షితులు కాకుండా, ప్రత్యామ్నాయంగా చుట్టు పక్కల పట్టణాలను కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివృద్ధి చేసే …
Read More »రోడ్డుపైనే ప్రథమచికిత్స చేసిన టీఆర్ఎస్ ఎంపీ బూర
భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తాజాగా తన వృత్తి ధర్మాన్ని పాటించి మరోసారి ప్రజల మనసు గెలుచుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ బాధితురాలికి స్వయంగా ప్రథమ చికిత్స చేసి వైద్యుడిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు.నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు వెళుతున్న బైక్ ముందు వెళుతున్న మరో వాహనాన్ని ఢీ …
Read More »సిరిసిల్లలో రూ. 5కే భోజనం..స్వయంగా అందరికీ వడ్డించి స్థానికులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 భోజనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రూ.5 ల భోజనం రుచితో పాటు నాణ్యత బాగా ఉండటంతో చాలా మంది నగరవాసులు మధ్యాహ్నం అవగానే భోజన స్టాళ్లను వెతికిమరీ తింటున్నారు. అయితే ఈ రూ.5 భోజనం ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా ప్రారంభం …
Read More »కేసీఆర్ బర్త్ డే రోజు టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా చారిటీ డ్రైవ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శాఖ చారిటీ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికాలోని మూడు ప్రావిన్స్ లలో చారిటీ డ్రైవ్ నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 17న జోహన్నెస్‌బర్గ్ లోని లీమో గెట్‌స్వే సేప్టీ హోంలో, కేప్‌టౌన్ లోని 16 ఎడ్వర్డ్ రోడ్ ఒట్టేరి ప్రాంతంలో, డర్బన్ లోని రిజర్వాయర్ …
Read More »ఆకర్షణీయంగా అందంగా ముస్తాబైన రంగంపేట్ ప్రభుత్వ పాఠశాల..!!
రంగు రంగుల బొమ్మలతో తరగతి గదులు, కాకతీయ కళాతోరణం, బతుకమ్మ రూపాన్ని తెలియజేశేలా ఉన్న ఈ పాఠశాలను చూసి ఏ కార్పోరేట్ స్కూలో అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోని వీర్నపల్లి మండలం రంగంపేట్ ప్రభుత్వ పాఠశాలని సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ) నిధులతో ఇలా ఆకర్షణీయంగా తయారుచేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను …
Read More »కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించారు.ఇవాళ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన సభలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. నల్గొండ నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత మీదేనని సూచించారు. సర్పంచ్‌గా ఓడిపోయిన వారు మనోధైర్యం కోల్పోవద్దనీ సూచించారు.
Read More »కాంగ్రెస్ కుటంబ రాజకీయం…నేతల భార్యలకు ముఖ్య పదవులు
విమర్శలు చేయడంలో ముందుండి…ఆచరించడంలో ఆమడ దూరంలో ఉండే కాంగ్రెస్ పార్టీ తాజాగా మరోమారు తన నైజాన్ని చాటుకుంది. ఎందరో ఆశావహులు ఉండగా…పదవుల పంపకం మాత్రం నేతల భార్యలకు కట్టబెట్టారు. ఈ ఉదంతం తాజాగా డీసీసీ పదవుల నియామకంలో ఈ విషయం స్పష్టమైంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలను అప్పగించింది. ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలకు డీసీసీ పదవులు కట్టబెట్టింది. భూపాలపల్లికి గండ్ర జ్యోతి, సంగారెడ్డికి నిర్మలా జగ్గారెడ్డి , మంచిర్యాలకు …
Read More »హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ…2000 కోట్ల పెట్టుబడితో…
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మక సంస్థల రాక కొనసాగుతోంది. తాజాగా, దక్షిణ కొరియాకు చెందిన అసెట్ మేనేజ్‌మెంట్ సేవల సంస్థ మిరే అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ.. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది ఈ రంగంలో సేవలు ఆరంభించిన సంస్థ.. ఇక్కడే బిజినెస్ పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ హైదరాబాద్‌తోపాటు పుణె, …
Read More »తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక సంస్థ..ప్రశంసించిన కేటీఆర్
తెలంగాణ రాష్ర్టానికి ప్రముఖ కంపెనీల రాక కొనసాగుతోంది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఒప్పో ఆర్‌ఆండ్‌డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ఈ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్‌లకు సహాయం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒప్పో ఓ ప్రకటనలో వివరించింది. స్టార్టప్‌లు, …
Read More »