ఇటీవలి కాలంలో సంచలన, వివాదాస్పద, కామెడీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న ప్రజాశాంతి పార్టీ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా మరో చిత్రమైన లాజిక్ తీశారు. రాష్ట్రంలో రాజకీయాలు మొదలుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్నపై సైతం ఆయన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై కొత్త పాయింట్ లేవనెత్తారు. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించిన సంగతి …
Read More »ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఎంపీ కవిత
దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును నిజామాబాద్ ఎంపీ కవిత అందుకున్నారు . ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రేష్ఠ్ సంసద్ అవార్డుల బహూకరణ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.శ్రేష్ఠ్ సంసద్ పేరుతో సర్వే నిర్వహించి ఎంపి కవితను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసిన …
Read More »తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి లైన్ క్లియర్..!!
రక్షణ శాఖకు చెందిన హైదరాబాద్ లోని బైసన్ పోలో మైదానంలో పెండింగ్ లో ఉన్న తెలంగాణ కొత్త సచివాలయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.నూతన సచివాలయం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించుకోవచ్చుని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని కేంద్ర రక్షణ శాఖ భూమి బైసన్ పోలోను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చాలాసార్లు ప్రధాని మోడీని …
Read More »కేసీఆర్ విధానాలు ఫాలో అవుతేనే దేశం అభివృద్ధి…జాతీయ ఆర్థిక నిపుణుడి ప్రకటన
గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా రోల్‌మోడల్‌గా నిలవగా…మరోవైపు భారతదేశ రూపురేఖలను మార్చేందుకు ఆయన ప్రతిపాదిస్తున్న ఆర్థిక నమూనాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు వాటిపై ఆలోచన చేస్తుండగా, తాజాగా వాటిపై ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నారు. దేశం ముందుకు వెళ్ళాలంటే కేసీఆర్ ప్రతిపాదించిన ఆర్థికనమూనానే అనుసరించాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఛైర్మన్ విజయ్‌కేల్కర్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు తాను …
Read More »మరోసారి ఏపీకి కేసీఆర్..ఎందుకంటే..?
టీఆర్ఎస్ పార్టీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశం ఉంది.గతకొన్ని రోజుల క్రితమే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక శారదాపీఠానికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని పీఠాధిపతి.. కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం .అయితే అలాగే వైసీపీ అధినేత …
Read More »జీవితంపై ఆశ వదులుకున్న 17 మందికి ఎంపీ కవిత….
దేశం కాని దేశం..ఏజెంట్ చేతిలో మోసం…స్వగ్రామానికి చేరేందుకు ఆశలు లేవు…తినడానికి తిండిలేదు…ఉండటానికి స్థలం లేదు…ఇది ఇరాక్‌లో చిక్కుకుపోయిన 17 మంది బాధితుల స్థితి. జీవితంపై ఆశలు వదులుకున్న సమయంలో వారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు తమ వ్యథను పేర్కొంటూ కాపాడాలని విన్నవించారు. దీంతో ఎంపీ కవిత రంగంలోకి దిగి…భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల సహాయ సహకారాలు పొందడంతోపాటు ఇరాక్‌లో ఇక్కట్ల నుంచి విముక్తి చేసే వరకు …
Read More »బాబు కులపిచ్చి..బయటపెట్టిన వైసీపీ ఎంపీ
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాలను, అవినీతి విధానాలను…అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసును వివిధ పార్టీలకు చెందిన నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకే అంశంలో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారనేది పోల్చి చూసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే తరహా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రాజెక్టుల పనితీరును…అవార్డుల విధానాలను విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లలో వివరించారు. …
Read More »కేబినెట్ విస్తరణకు ముహుర్తం రెడీ
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు కేబినెట్ విస్తరించొద్దంటూ ఈసీ ఆదేశించడం.. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ టూర్, యాగంతో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 30వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.. చండీయాగాన్ని కేసీఆర్ దిగ్విజయంగా నిర్వహించారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ విస్తరణపై దృష్టిసారించారు. తాజాగా, కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. శనివారం …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో కీలక నిర్ణయం వెలువడనుంది. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో వరి సాగు విస్తీర్ణం మరింత పెరిగి… ధాన్యం దిగుబడి పెరుగుతుందని… దాని ప్రభావం ధరలపై పడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. దీంతో బియ్యం మార్కెటింగ్‌కోసం, పౌరసరఫరాల వ్యవస్థను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అధ్యయనం చేయించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నిర్ణయించారు. బియ్యం మార్కెటింగ్‌పై అధ్యయన బాధ్యతలను సెంటర్ …
Read More »కోదండరాం జాడేది…పంచాయతీ ఎన్నికల్లో పత్తాలేని అగ్గిపెట్టె పార్టీ
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్న తెలంగా రాష్ట్ర సమితిపై ఉద్దేశపూర్వక వ్యతిరేకతే ప్రధాన అజెండాగా రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటైన తెలంగాణ జనసమితి అడ్రస్ గల్లంతు అయింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న కోదండరాం అనంతరం కాంగ్రెస్-టీడీపీ- సీపీఐతో ప్రజాకూటమిలో జట్టుకట్టి బరిలో దిగినప్పటికీ…బొక్కాబోర్ల పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఖాతాలో మరో పరాజయం నమోదైంది. పంచాయతీ ఎన్నికల్లో అగ్గిపెట్టె పార్టీ అడ్రస్ గల్లంతు …
Read More »