తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాల విషయంలో ఎవ్వరిని అడిగినా ఒకటే మాట . ఈ సారి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీయారే సీఎం . ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రైవేట్ సంభాషణల్లో ఇదే మాట చెబుతున్నరు . తెలంగాణలో అత్యధిక శాతం మంది ప్రజలది దాదాపుగా ఇదే అభిప్రాయం . ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన దాదాపు అన్ని సర్వేల్లో అధికార టి ఆర్ ఎస్ పార్టీకి …
Read More »అందరికీ రుణ ఫలాలు దక్కాలి..మంత్రి హరీష్
బీసీలందరికీ రుణ ఫలాలు దక్కాలి. ఏదడిగితే అదే ఇద్దాం. కుల వృత్తుల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కార్పోరేషన్ రుణాలు అందజేయడంలో నిజమైన అర్హులను గుర్తించాలని, చిరు వ్యాపారులందరికీ.. బహు ప్రయోజనం కలగాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం బీసీ, ఎంబీదీ- వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి జిల్లా కలెక్టర్ …
Read More »కేరళ వరద బాధితులకు మంత్రి జగదీష్ రెడ్డి విరాళం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కేరళ వరద బాధితులకు విరాళాన్ని ప్రకటించారు.కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం 9కోట్ల రూపాయల ను సీఎండీ ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..ప్రకృతి బీభత్సం తో కేరళ …
Read More »కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో చుక్కెదురు..!!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభా బహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ …
Read More »ఈ నెల 24 నుంచి బాలికా ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం..!!
‘‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ నినాదంతో తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన భారీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీన బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్స్ ను కూడా 31 జిల్లాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీనుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు …
Read More »ప్రాజెక్టుల్లోకి నీరు..కాంగ్రెస్ నేతల కళ్లల్లో కన్నీరు…!!
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు శుభవార్త. ఎగువ నుంచి భారీ వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్ కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , మిషన్ భగీరథ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ …
Read More »“సరస్వతి తల్లి”కి అండగా ఎమ్మెల్యే అరూరి ..
పుట్టింది పేదరికంలో.అయితేనేమి చదువులో నెంబర్ వన్..కుటుంబం పేదరికమైన కానీ అమ్మానాన్నల కష్టాలను తీర్చడానికి ఎంతో కష్టపడి చదువుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకునేంత అహర్నిశలు కష్టపడి చదివింది. తీరా అప్పుడు కూడా పేదరికం ఎదురైంది.ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన మేకల రమేష్,పూలరాణి దంపతుల కూతురు మేకల హార్షిణి. తనను …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఉదారత..!
కేరళ వరద బాధితులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ వరద బాధితుల కోసం తక్షణ సాయం కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించడమే కాకుండా యాబై రెండున్నర లక్షల విలువ చేసే బాలామృతం,యాబై టన్నుల పాలపోడి,ఐదు వందల టన్నుల బాయిల్డ్ రైస్ తో పాటుగా త్రాగునీటిని శుద్ధి చేసే రెండున్నర కోట్ల రూపాయల విలువ …
Read More »యువ క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ అభినందన
యువ క్రీడాకారుడికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించిన వరంగల్‌కు చెందిన 14 ఏండ్ల అర్జున్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. అబుదాబిలో జరిగిన పోటీల్లో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన పద్నాలుగేండ్ల అర్జున్‌తో మంత్రి కేటీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లోని క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గ్రాండ్ మాస్టర్ అర్జున్‌ను అభినందించారు. …
Read More »కేటీఆర్ సవాల్‌కు పారిపోయావు..విమర్శలెందుకు ఉత్తమ్?
ప్రజామోదాన్ని పొందలేని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో …
Read More »