Blog Layout

అవతార్ కు చెక్ పెట్టేందుకు..అవెంజర్స్ రెడీ..!!

‘అవతార్‌’ఇప్పటివరకూ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది. దాదాపు పదేళ్ల క్రితమే 278 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటివరకూ ఏ చిత్రమూ కూడా దీనిని క్రాస్ చేయలేకపాయింది.ప్రస్తుతం ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో వస్తున్న ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’కు అవతార్ వసూళ్లు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.గతేడాది విడుదలైన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ భారత్‌లో రూ.298 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లందుకున్న హాలీవుడ్‌ చిత్రంగా నిలిచింది …

Read More »

వెట్‌ రన్‌ విజయవంతం జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు హర్షం

భారతదేశ చరిత్రలో మొదటి సారిగా సాగునీటి రంగంలో అత్యధిక మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా ఉపయోగంలోకి తెచ్చిన ఘనత తెలంగాణ విద్యుత్తు సంస్థలకు దక్కడం ఆనందదాయకమని జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. 124.4 మెగావాట్ల కాళేశ్వరం ప్రాజెక్టు (మేడారం-ప్యాకేజి -6) మొదటి పంపు ట్రయల్ రన్ (వెట్ రన్) ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం …

Read More »

టిక్‌టాక్‌లో సీఎం కేసీఆర్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్‌

సామాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. టిక్‌టాక్‌లో సీఎం కేసీఆర్‌ను అవమానించేలా ఓ వ్యక్తి వీడియోలు పోస్ట్‌ చేశాడు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేత రామ్‌ నర్సింహగౌడ్‌ రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి వీడియోలు పోస్ట్‌ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని తిరువూరు వాసి నవీన్‌గా గుర్తించి అరెస్ట్‌ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం..సీఎం కేసీఆర్ హర్షం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరమైనదిగా సీఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక …

Read More »

కొద్దిరోజుల్లో ప్రభుత్వం మారుతుండడంతో ఈ ఘటనపై రేకెత్తుతున్న అనుమానాలు

గతంలో విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడిచేసిన శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచారు. నిన్నరాత్రి పదిగంటల తర్వాత శ్రీనివాసరావుకు ఛాతిలో నొప్పి తీవ్రంగా రావడంతో ఆయనను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స …

Read More »

ఇంటర్ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ల వాల్యువేషన్, ఫలితాల …

Read More »

ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ వెరిఫికేషన్, …

Read More »

జర్నలిస్టులు చేసిన సర్వే.. వైసీపీ 131 సీట్లు భారీ విజయమంట..!

ఇటీవ‌ల ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో మే 23న వైసీపీ పార్టీ అధికారంలోకి క‌చ్చితంగా వస్తుంది అని ఇప్పటికే అన్ని సర్వేలు తెలిపాయి. తాజాగా ఎన్నికల ఫలితాలపై మరో కొత్త సర్వే అందుబాటులోకి వచ్చింది. జర్నలిస్టులు చేసిన సర్వే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే చేయించింది మోహన్, మధు, శ్రీధర్ అంటూ పేర్కొంటున్నారు. ఈ సర్వేలో వైసీపీ పార్టీకి జైకొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. ఏపీలోని మొత్తం 175 …

Read More »

జనసేన కార్యాలయాల మూసివేతపై పవన్ ఏమన్నారంటే

ఎన్నికలు ముగిసాయి.. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు పలు ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ విషయాన్ని పలువురు జనసేన నేతలు ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ వద్ద ప్రస్తావించగా పవన్ ఈ అంశంపై స్పందించారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో …

Read More »

నాన్నతో టచ్ లో ఉంటాను.. అమ్మకు నేనే పెళ్లి చేసా.. ఎందుకంటే

తాజాగా చిత్రలహరి చిత్రంతో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఇటీవల అనూహ్యంగా తన ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రస్తావించారు. తాను పదవ తరగతి చదువుతున్నప్పుడే అమ్మానాన్నలు విడిపోయారని చెప్పాడు. అయినా నాన్న లేని లోటు తెలియకుండా అమ్మ తనను, తమ్ముడిని పెంచిందని చెప్పారు. నాన్నతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని చెప్పారు. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదని, వాళ్లిద్దరి మధ్య సినిమాల ప్రస్తావన ఉండదని చెప్పారు. ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat