తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరో,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ మహర్షి. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మహేష్ బాబు కేరీర్లోనే ఇరవై ఐదో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. పోస్టు ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం …
Read More »Blog Layout
తలనొప్పి రావడానికి గల ప్రధాన కారణాలు..!
సాధారణంగా మనలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. క్షణం తీరికలేని జీవనం, సమయానికి నిద్ర, ఆహారం లేకపోవడం, నిలకడలేని ఆలోచనలతో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో తలనొప్పి ఒకటి. * తలస్నానం చేసిన తలను పూర్తిగా ఆరబెట్టకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం. అందుకోసం డ్రైయ్యర్‌ను ఉపయోగించాల్సిన పనిలేదు. సహజంగా వీచే గాల్లో కాసేపు …
Read More »గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు ఎంతో తెలుసా..?
గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులను స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లెక్క తేల్చింది. నయీంకు మొత్తం రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఆస్తులు గా తేల్చారు. నయీంపై మొత్తం నమోదైన 251 కేసుల్లో 119కేసులు దర్యాప్తు పూర్తయినట్లు సిట్ వెల్లడించింది. మరో 60 కేసులు కొలిక్కి రాలేదని.. రెండు నెలల్లో నయీం …
Read More »కోడెలపై సీఈఓకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు…
గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్ స్టేషన్‌లోనికి ప్రవేశించి టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ చేసిన హైడ్రామాపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ..ఇనిమెట్లలోని 160 పోలింగ్ స్టేషన్లో కోడెల …
Read More »భర్త నల్లగా ఉన్నాడని తగలబెట్టి చంపేసింది..
ఉత్తరప్రదేశ్, బరేలిలో దారుణం చోటుచేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య పెట్రోల్‌పోసి తగలెట్టేసింది. బరేలిలో నివసిస్తున్న ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. 5 నెలల పాప ఉంది. చూడటానికి అందంగా ఉండే ప్రేమ్ శ్రీ తన భర్త సత్యవీర్ సింగ్ నల్లగా ఉన్నాడని బాధపడేది. ఎప్పుడు అతని శరీర రంగును ప్రస్తావిస్తూ గొడవపడేది. ఇదంతా మాములేనని కుటుంబసభ్యులు భావించగా.. ప్రేమ్‌శ్రీ వారు ఊహించని ఘాతుకానికి పాల్పడింది. తన …
Read More »సోమిరెడ్డిగారూ .. ఆ అరాచకాలు మీరే చేయించారా ..??
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు.. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు సమాధానం చెప్పాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.. మంత్రి సహకారంతోనే దాడులు జరుగుతున్నాయనా అని ప్రశ్నించారు..తిరుమలనాయుడు పై దాడి చేసిన వారు వైసీపీ కార్యకర్తలు అయినప్పటికీ తానెప్పుడూ దాడులను ప్రోత్సహించ లేదన్నారు.. తిరుమలనాయడు అధికారం ఉంది కదా అని అనేక పాఠశాలల పై దాడులు …
Read More »మరో హిట్టు కొట్టడానికి “తీస్ మార్ ఖాన్” తో మీ ముందుకు..!
గత ఏడాది సెప్టెంబర్ 28న కల్యాణ్ జి గోగాన దర్శకత్వంలో అశిశ్ గాంధీ, అశిమా నర్వల జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాటకం’. ఈ చిత్రాన్ని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాగా సాయి కీర్తిక్ సంగీతం అందించారు.అయితే డైరెక్టర్ కల్యాణ్ జి, నటుడు అశిశ్ గాంధీకు ఇది మొదటి చిత్రం కాగా..తమ మొదటి సినిమాలోనే హిట్ టాక్ అందుకున్నారు. హీరోగా …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కృతం..!!
తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఈ రోజు ఆవిష్కృతమైంది. వెట్ రన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటిని ఇంజినీర్లు, అధికారులు విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు జంట సొరంగాల్లోకి పోతాయి. దాదాపు 11 మీటర్ల డయా ఉన్న ఒక్కో టన్నెల్ సుమారు 9.534 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నంది …
Read More »చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవాల్సిందే..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు.చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవాల్సిందేనని ప్రజలు తీర్పుచెప్పారు. మే 23న ఓట్ల లెక్కింపు అనంతరం ఓటమి ప్రకటన లాంఛన ప్రాయమే. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం పచ్చ మీడియా ఆయన అఖండ విజయం సాధిస్తారని విశ్లేషణలు ఇస్తోంది. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనే సామెత వీరి కోసమే పుట్టి ఉంటుంది” …
Read More »విశాఖలో దారుణం..నిండు గర్భిణీ అని కూడా చూడకుండా వరకట్న వేధింపులు
విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది.నిండు గర్భిణీ అని కూడా చూడకుండా భర్త, అత్త వరకట్న వేధింపులకు పాల్పడ్డారు.పుట్టింటి నుండి రూ.25 లక్షలు అదనపు కట్నం తేవకపోతే.. అబార్షన్ చేయించుకోవాలంటూ.. భర్త దామోదర్, అత్త లలిత కలిసి ఆమెపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టారు.అయితే అబార్షన్ కు ఆమె నిరాకరించింది.అయితే తల్లీ కొడుకులు ఇద్దరు ప్లాన్ చేసుకొని మరీ ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి.. కారులో ఆ గర్భిణీపై దాడి చేశారు.ఆ …
Read More »