rameshbabu
December 28, 2020 SLIDER, TELANGANA
640
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 551 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. ఇందులో 2,77,304 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 6231 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 4136 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల మరో ఇద్దరు మరణించడంతో …
Read More »
rameshbabu
December 28, 2020 NATIONAL, SLIDER
904
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 18 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 20 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 9 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 2 లక్షలకు చేరాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 20,021 మంది కరోనా బారినపడ్డారు. తాజా కేసులతో ఇప్పటివరకు కరోనా బారినపడ్డవారి సంఖ్య …
Read More »
rameshbabu
December 28, 2020 SLIDER, TELANGANA
752
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కల సాకారమవుతున్నది. హరిత తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం సత్ఫలితాలనిస్తున్నది. అంతరించిపోతున్న అడవులు తిరిగి ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల మండలాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో చేపట్టిన బ్లాక్ ప్లాంటేషన్‌తో ఈ ఐదేండ్లలో సుమారు 17వేల ఎకరాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. దాదాపు 68.81 లక్షల మొక్కలు నాటగా ఏపుగా పెరిగి …
Read More »
rameshbabu
December 28, 2020 SLIDER, TELANGANA
1,000
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరో ఆరుగురిని కమిషన్ సభ్యులుగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునుంచి ఐదేండ్లపాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. సునీత భర్త లక్ష్మారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా గోమారం సర్పంచ్‌తోపాటు శివ్వంపేట …
Read More »
rameshbabu
December 28, 2020 SLIDER, TELANGANA
542
తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత …
Read More »
rameshbabu
December 28, 2020 SLIDER, TELANGANA
643
ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం …
Read More »
rameshbabu
December 27, 2020 SLIDER, TELANGANA
985
బీజేపీ సీనియర్ నాయకుడు మాధవరం భీం రావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివేకానంద సేవా సమతి సభ్యులుగా పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. భారత్ వికాస్ ఫౌండేషన్‌లో కూడా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన వివేకానంద నగర్ కాలనీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భీమ్‌రావు మృతిపట్ల బీజేసీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి …
Read More »
rameshbabu
December 27, 2020 MOVIES, SLIDER
1,087
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీ, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక …
Read More »
rameshbabu
December 27, 2020 SLIDER, SPORTS
1,362
బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ.. హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. తొలిరోజు ఫీల్డింగ్ మొహరింపుల దగ్గర నుంచి మొదలుపెడితే.. ఇవాళ్టి బ్యాటింగ్ వరకు రహానే మంచి మార్కులను కొట్టేశాడు. ప్రస్తుతం రహానే, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఇరువురు దాటిగా ఆడుతూ ఆసీస్ బౌలర్ల నుంచి పరుగులు రాబడుతున్నారు. ఆదివారం 36/1తో రెండో రోజు …
Read More »
rameshbabu
December 27, 2020 MOVIES, SLIDER
1,151
సూపర్ స్టార్ రజనీకాంత్ హై బీపీతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత రాత్రి రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొన్ని రిపోర్ట్స్ రాగా, వాటిలో ఎలాంటి సమస్య లేదని అన్నారు. మరి కొన్ని రిపోర్ట్స్ వచ్చాక వాటిని బట్టి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి కొద్ది గంటలలో ప్రత్యేక వైద్య బృందం అపోలో …
Read More »