Classic Layout

Pink Ball తో చరిత్ర సృష్టించిన స్మృతి మందానా

ఇండియ‌న్ వుమెన్స్ టీమ్ ఓపెన‌ర్ స్మృతి మందానా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జ‌రుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచ‌రీ బాదింది. దీంతో పింక్ బాల్ టెస్ట్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు త‌ర‌ఫున సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా ఆమె నిలిచింది. 171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోరును అందుకుంది. నిజానికి తొలి రోజే ఆమె సెంచ‌రీ చేసేలా క‌నిపించినా.. వ‌ర్షం అడ్డుప‌డ‌టంతో …

Read More »

రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలపాటు దేశానికి సేవలు అందించేలా రాష్ట్రపతికి భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తిని అందించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

Read More »

నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం

మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, కౌన్సిల్‌లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధిక మొత్తంలో పంట నష్టం, రైతుకు అపారమైన నష్టం వాటిల్లిందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. …

Read More »

సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద 2 ల‌క్ష‌ల 19 వేల ఎక‌రాల‌కు సాగునీళ్ళు

 సంగారెడ్డి జిల్లా ప‌రిధిలో సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద 2 ల‌క్ష‌ల 19 వేల ఎక‌రాల‌కు, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద ఒక ల‌క్షా 65 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డం జ‌రుగుతోంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. సంగ‌మేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్యయం రూ. 2,653 కోట్లు, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ. 1,774 కోట్ల‌తో నిర్మిస్తామ‌ని తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై స‌భ్యులు …

Read More »

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపుపై -మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు.దేశంలోని జిల్లా ఆస్పత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్‌ రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ విడుదల చేశారు. …

Read More »

Huzurabad By Poll-నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఈనెల 8న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుందని సీఈవో శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ప్రతి ఈవీఎంలో 16 మంది అభ్యర్థులు, నోటా ఆప్షన్‌కు అవకాశం ఉంటుందని, నామినేషన్ల సంఖ్య పెరిగితే అదనంగా ఈవీఎంలను సిద్ధం చేస్తామని చెప్పారు. ఉప ఎన్నిక పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను …

Read More »

మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

ఏపీ సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని  అన్నారు. బుధవారం మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై వైసీపీ నాయకుల్లోనే గాక.. సర్వతా జరుగుతోంది. సీఎం జగన్‌ తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జరుగుతున్న …

Read More »

ఈటల ఇంకా ఇంటికెళ్లుడేనా..?

నిన్నటికి నిన్న రాజకీయ కురువృద్ధుడైన ఒక నేత.. అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది!అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది! వారసత్వ రాజకీయాన్ని ఘనంగా చాటుకునే మరో నాయకుడు.. ఓ విద్యార్థి నేతకు లభించిన ప్రజామద్దతు ముందు తలొంచాల్సి వచ్చింది! రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న అనేకమంది.. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవారి ముందు డీలాపడిన సందర్భాలెన్నో! ఒకప్పుడు పెద్దపల్లిలో, …

Read More »

‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో రుజువు చేసిన ఈటల రాజేందర్‌

‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్‌ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్‌ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటలకు పార్టీలో, ప్రభుత్వంలో మరెవ్వరికీ దక్కని ప్రాధాన్యం లభించింది. ప్రజలను ఆదరించి అభివృద్ధి చేయమని పదవులిస్తే.. పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశాడు. తన ఆస్తులపెంపుకోసం ఆరాటపడి భూ ఆక్రమణలకు పాల్పడ్డాడు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై …

Read More »

ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే నన్నపునేని..

పెరుకవాడకు చెందిన ఆటో డ్రైవర్ వల్లెపు మదుసూదన్ ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.. మదుసూదన్ బార్య లతకు,పిల్లలకు 25 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో వారికి అందజేసారు.. వారి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో ఐక్యత ఆటోయూనియన్ బొల్లం సంజీవ్,నాగరాజు,మహేష్,రాజేందర్,కుమార్,నరేష్,రాకేశ్,శివ,కిషోర్,దేవరాజ్,నబి తదితరులు పాల్గొన్నారు..

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat