rameshbabu
July 30, 2021 SLIDER, TELANGANA
501
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు పెద్దిరెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఒక ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే అనుకున్న ప్లానింగ్ అమలు చేయాలన్నారు. ఒక పథకం ప్రారంభించామంటే.. దాని ఫలితం, ప్రతిఫలం, భవిష్యత్ ఫలాలు ఊహించి పకడ్బందీగా ప్లాన్ చేస్తేనే అభివృద్ధి అవుందన్నారు.‘‘హైదరాబాద్ లో గీత కార్మికుల పొట్టగొట్టి కల్లు దుకాణాలు బంద్ …
Read More »
rameshbabu
July 30, 2021 SLIDER, TELANGANA
461
దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్టినట్లు సీఎం తెలిపారు. దళితుల అభివృద్ధికి లక్ష కోైట్లెనా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల దళిత బంధు ఏడాది ఆలస్యమైందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ …
Read More »
rameshbabu
July 30, 2021 NATIONAL, SLIDER
713
ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్(Delta variant ) కరోనా వైరస్ దడ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వైరస్ వేరియంట్.. చికెన్ పాక్స్(chickenpox) కన్నా ప్రమాదకరమన్న సంకేతాలను అమెరికా వినిపించింది. అగ్రరాజ్యానికి చెందిన అంటువ్యాధుల సంస్థ (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ఈ విషయాన్ని తెలిపింది. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరరీతిలో విస్తరిస్తోందని, వ్యాక్సిన్ల రక్షణ వలయాన్ని కూడా అది చేధించగలదని, …
Read More »
rameshbabu
July 30, 2021 SLIDER, TELANGANA
646
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు కొనసాగింపుగా వంతెన నిర్మాణంపై అడుగులు పడుతున్నాయి. రింగ్ రోడ్డు సమీపంలోని శ్మశానవాటిక నుంచి రామంతాపూర్ వైపున్న మోడ్రన్ బేకరీ వరకు వంతెన నిర్మించనున్నారు. ఈ పనుల కోసం టెండర్ నోటిఫికేషన్ ప్రకటించగా, తాజాగా మూడు సంస్థలు బిడ్ దాఖలు చేశాయని ఇంజనీరింగ్ విభాగం అధికారొకరు తెలిపారు. బిడ్‌ల పరిశీలన జరుగుతోందని, నిర్మాణ సంస్థ ఎంపిక త్వరలో …
Read More »
rameshbabu
July 30, 2021 SLIDER, TELANGANA
579
తెలంగాణ సాధనకోసం ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన, పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దీనికి ఉదాహరణ బండా శ్రీనివాస్ నియమాకమేనని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాస్ శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సాంస్కృతిక సారథి చైర్మన్ …
Read More »
rameshbabu
July 30, 2021 SLIDER, TELANGANA
415
హుజురాబాద్ నుంచి ప్రవేశపెట్టనున్న పథకాలన్నీ గత బడ్జెట్‌లోనివేనని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రితో …
Read More »
rameshbabu
July 30, 2021 SLIDER, TELANGANA
420
నేతన్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత బీమా కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ పథకం కింద రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నేతన్నకు చేయూత కార్యక్రమం అమలవుతుందన్నారు. దీని ద్వారా కరోనా కాలంలో 26 వేల కుటుంబాలకు 110 కోట్లు ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు.సిరిసిల్ల అపరెల్ పార్కులో గోకల్‌దాస్ ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన …
Read More »
rameshbabu
July 30, 2021 SLIDER, TELANGANA
479
సిరిసిల్ల అపరెల్ పార్కులో గోకల్‌దాస్ ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అపరెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ… 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అపరెల్ పార్కు పెడుతామని మాటిచ్చారు. కానీ అమలు చేయలేదు. …
Read More »
rameshbabu
July 30, 2021 ANDHRAPRADESH, SLIDER
1,746
ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఆగస్టు 14 వరకు కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కర్ఫ్యూ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.
Read More »
rameshbabu
July 30, 2021 SLIDER, SPORTS
1,567
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేపుతోంది. కరోనా సోకి కృనాల్ పాండ్యా ఇప్పటికే ఐసోలేషన్లో ఉండగా.. కృనాల్తో సన్నిహితంగా మెలిగిన చాహల్, కృష్ణప్ప గౌతమ్లకు కూడా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు కృనాల్తో సన్నిహితంగా ఉన్న హార్దిక్ పాండ్యా, పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్, దీపక్ చాహర్, మనీష్ పాండే, ఇషాన్ కిషన్ ప్రస్తుతం శ్రీలంకలోనే ఐసోలేషన్లో ఉన్నారు.
Read More »