తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు యాబై వేల ఉద్యోగాలపై క్లారిటీచ్చారు.సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హారీష్ మాట్లాడుతూ” ప్రభుత్వం త్వరలోనే 50వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వెల్లడించారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. సి మాట్లాడిన మంత్రి.. ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతీ-యువకులకు …
Read More »TimeLine Layout
February, 2021
-
2 February
ప్రతి కౌగిలింతకు ఓ లెక్క ఉంది గురు…?
మనం సందర్భాన్ని బట్టి మనం ఇచ్చే కౌగిలింతకూ ఓ అర్థం ఉంది. భార్యను హగ్ చేసుకుంటే ఎంతో సేఫ్గా ఫీలవుతారు. స్నేహితులకు ఇచ్చే బియర్ హగ్ వల్ల వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. భుజంపై తలవాల్చి కౌగిలించుకుంటే నమ్మకం పెరుగుతుంది. మనసుకు నచ్చినవారిని ఎక్కువ సేపు కౌగిలించుకుంటాం. అందులో ఆనందభాష్పాలు నిండి ఉంటాయి. రొమాంటిక్ హగ్తో ఒకరి మనసులోని స్పందనలను మరొకరు ఆస్వాదిస్తారు. వీటిలో ఎంతో లవ్ ఉంటుంది.
Read More » -
2 February
బీజేపీ సంచలన నిర్ణయం
గుజరాత్ రాష్ట్ర బీజేపీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు రాజకీయనాయకుల బంధువులకు.. అలాగే, ఇప్పటికే మూడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారికి పార్టీ తరపున నిల్చునేందుకు టికెట్లు ఇచ్చేది లేదని ప్రకటించింది. పార్టీ టికెట్ల కోసం పోటీ పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు BJP గుజరాత్ శ్రేణులు చెబుతున్నాయి
Read More » -
2 February
పుదీనా ఆకులతో లాభాలు ఏమిటో తెలుసా..?
పుదీనా ఆకులతో ఆరోగ్యం ఉంటుంది తెలుసా.. అసలు పుదీనా ఆకులతో ఉపయోగాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి పుదీనా వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది మైగ్రేన్ సమస్య దూరమవుతుంది అలర్జీ, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది శీతాకాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతు నొప్పుల నుంచి నివారణ లభిస్తుంది పుదీనాలో ఉండే విటమిన్ C, D, E, కాల్షియం , …
Read More » -
2 February
డిఫరెంట్ గా “ప్రేమమ్” ఫేమ్ మడోన్నా సెబాస్టియన్
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెది భిన్నమైన క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. నానికి మడోన్నాకు కలకత్తా నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయట. ఇంకా ఈ మూవీలో నానికి జోడిగా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు
Read More » -
2 February
SDG సాధనలో తెలంగాణ భేష్
సమీకృత అభివృద్ధి లక్ష్యాల(SDG) సాధనలో తెలంగాణ రాష్ట్ర పనితీరు బాగుందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. 2019లో ఎస్ డీజీ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 2015-19 మధ్యకాలంలో మెరుగైన వృద్ధి రేటుతో ముందుకు సాగిందని వివరించింది. అటు వెనుకబడిన 20 శాతం మండలాల అభివృద్ధికి కార్యచరణ రూపొందించాలని సూచించింది. దేశంలో వామపక్ష తీవ్రవాదం అభివృద్ధిపై ప్రభావం చూపుతున్న 35 జిల్లాల్లో.. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో …
Read More » -
2 February
చిలకడ దుంపలు తింటే ఉంటది..?
టేస్టీగా ఉండే చిలకడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్-ఎ వల్ల రోగనిరోధక శక్తి బలోపీతమవుతుంది. ఇంకా కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిని ఉడకబెట్టుకుని తింటే పోషకాలు అంది చర్మం నిగనిగలాడుతుంది సంతానోత్పత్తి సమస్యలకు చిలకడ దుంపలు చెక్ పెడతాయి. గొంతు, ఛాతీ భాగాల్లో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. మొటిమలను నిలువరిస్తాయి. శరీర ఎదుగుదలను ప్రేరేపిస్తాయి
Read More » -
2 February
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర వాసులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నాయి. మరో రెండు నెలల్లో సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ సమావేశంలో తయారీదారులకు వివరించనుంది.
Read More » -
2 February
మద్యం ప్రియులకు శుభవార్త
దేశంలోని మద్యం ప్రియులకు శుభవార్త.. అదేంటంటే పెట్రోల్, డీజిల్ తరహాలోనే మద్యంపై 100శాతం అగ్రి ఇన్ ఫ్రాస్టక్చర్ అండ్ డెవలప్ మెంట్ సెస్ (AIDC) విధించిన కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఇంపోర్టెడ్ మద్యంపై 150శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా.. దాన్ని 50శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిపి మొత్తంగా 150శాతానికే పరిమితం అవుతుందని …
Read More » -
2 February
‘కివీ’ తో ఉపయోగాలు తెలుసా..?
‘కివీ’ ఉపయోగాలు ఎంటో ఒక లుక్ వేద్దాం రక్తసరఫరా మెరుగుపడుతుంది దగ్గు, జలుబు తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఆస్తమాను నివారిస్తుంది ఈ పండు గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారంగా ఉండటమే కాకుండా, కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానసిక వ్యాధులను అరికడుతుంది అధిక బరువు తగ్గిస్తుంది
Read More »