కరోనా మహమ్మారి వలన ఈ ఏడాది సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయాయి. రిలీజ్‌కు సిద్దంగా ఉన్న సినిమాలు థియేటర్స్ లేక ఓటీటీలో విడుదలయ్యాయి. ఏడాది చివరికి వచ్చేసాం కాబట్టి 2020లో గూగుల్‌లో అత్యధికంగా ఏ సినిమాల కోసం వెతికారు అనేది ఒకసారి పరిశీలిస్తే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బెచారే సినిమానే ప్రేక్షకులు అత్యధికంగా వెతికారు. సుశాంత్ సింగ్ చివరి సినిమా …
Read More »TimeLine Layout
December, 2020
-
27 December
తెలంగాణొస్తే ఏమొచ్చింది? అంటే..?
నీళ్లు ఆ గ్రామస్వరూపాన్ని మార్చివేశాయి. కరువు ఛాలయను కడిగేశాయి. ప్రజల జీవన స్థితి గతులను మార్చివేశాయి. వలసలకు అడ్డుకట్ట వేశాయి. రెండేండ్లలోనే ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోట గ్రామం. దశాబ్దాల తరబడి ఎండిపోయిన చెరువులు, నెర్రెబారిన నేలలు.. కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆ గ్రామం నేడు ఊహించనిస్థాయిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఉపాధి కోసం వలసబాట పట్టిన వారంతా తిరిగి సొంతగూడుకు చేరి …
Read More » -
26 December
ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 354 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టివరకు 8,80,430 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,69,478 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 3,861 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా 7,091 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో …
Read More » -
26 December
వికారాబాద్‌లో ఘోరం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు మృతిచెందారు. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సంగారెడ్డి దవాఖానకు తరలించగా.. మరొకరు …
Read More » -
26 December
ఫ్రాన్స్‌లో కొత్త రకం కరోనా కేసు నమోదు
ఫ్రాన్స్‌లో కొత్త రకం కరోనా కేసు నమోదు అయ్యింది. బ్రిటన్‌లో గుర్తించిన వేరియంట్ ఫ్రాన్స్‌లో కనిపించినట్లు అధికారులు ద్రువీకరించారు. టూర్స్ పట్టణంలోని తమ పౌరుడికే ఆ వైరస్ సోకినట్లు ఫ్రెంచ్ ఆరోగ్య శాఖ చెప్పింది. డిసెంబర్ 19వ తేదీన అతను లండన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతనిలో లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం అతను ఇంటి వద్దే స్వీయ నియంత్రణలో ఉన్నారు. ఇటీవల ఇంగ్లండ్‌లో కనిపించిన కొత్త రకం వైరస్ …
Read More » -
26 December
సోమవారం నుండి రైతుబంధు
యాసంగి సీజన్ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ చేయడానికి సిద్ధమైంది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. గతేడాది 57.62 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయగా.. ఈ సీజన్‌లో 1.70 లక్షల మంది …
Read More » -
26 December
జనవరి 13నుండి ఐనవోలు జాతర
ఉమ్మడి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ జాతరకు అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు, అర్చకులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన భద్రత, లావెట్రీలు, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, …
Read More » -
26 December
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి లత గౌడ్
రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నటుతున్నరు తాజాగా గౌడ్ తెలంగాణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సినీ నటి బత్తిని లత గౌడ్ గారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో ఎల్లమ్మ గుడి వద్ద గౌడ కులస్థులకు తన వంతుగా ఉచితంగా 100 గిరక తటి మొక్కలు పంపిణీ చేశారు ..అనంతరం తాను …
Read More » -
26 December
టీమిండియా దెబ్బకు ఆసీస్ ఆలౌట్
మెల్‌బోర్న్‌లో భారత బౌలర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తన తొలి ఇన్నింగ్స్‌లో 196 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. ఆరంభంలో అశ్విన్ తన స్పిన్‌తో అదరగొట్టగా.. ఆ తర్వాత బుమ్రా టెయిలెండర్లను త్వరత్వరగా ఇంటికి పంపించేశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మాథ్యూ …
Read More » -
25 December
మానవాళికి మార్గదర్శకం భగవద్గీత : ఎమ్మెల్సీ కవిత
నిత్యం గీతా పఠనం చేయడం ద్వారా జీవితంలో సన్మార్గంలో పయనిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన ‘గీతాజయంతి మహోత్సవం’లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ముందుగా గో మాతను పూజించిన ఎమ్మెల్సీ కవిత, భారతీయ సంస్కృతిలో గో పూజకు ఎంతో విశిష్టత ఉందన్నారు. భగవద్గీతలోని ఎన్నో సూక్ష్మమైన, ఆధ్యాత్మికమైన అంశాలను వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా …
Read More »