ఉమ్మడి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు.
ఈ జాతరకు అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు, అర్చకులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన భద్రత, లావెట్రీలు, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూ లైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భక్తులకు అన్నదానం వంటి అనేక వసతుల కల్పన పై ఆయాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు.