TimeLine Layout

November, 2020

  • 2 November

    నేటినుంచి ధరణీ రిజస్ట్రేషన్

    తెలంగాణ రెవెన్యూశాఖలో సోమవారం నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. గత నెల 29న సీఎం కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి అరగంటకు ఒక స్లాట్‌ చొప్పున కేటాయించారు.మధ్యలో అరగంటపాటు …

    Read More »

October, 2020

  • 31 October

    బీజేపీపై మంత్రి హారీష్ ఫైర్

    బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం నిధులున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఏది నిజమో.. ఏది అబద్ధమో దుబ్బాక ప్రజలు ఆలోచించాలని, తప్పుడు ప్రచారాలని నమ్మి మోసపోతే గోస పడతామని అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు, మేధావులకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే బీజేపీ నేతల అబద్ధాలపై …

    Read More »
  • 31 October

    ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ

    ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, ముఠా గోపాల్‌, ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌, ఉద్యోగుల సంఘం నేత కారం రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ నాయకులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు  కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్లోరోసిస్‌ కారణంగా కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ రమావత్‌ సువర్ణ గీసిన చిత్రాలను సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్‌రెడ్డి కవితకు అందజేశారు.

    Read More »
  • 31 October

    తెలంగాణరాష్ట్రంలో 1,531 కరోనా కేసులు.. ఆరుగురి మృతి

    తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. మూడు రోజులుగా 1481, 1504, 1531 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగితే పండుగ సందర్భంగా వైరస్‌ వ్యాప్తి మొదలైనట్లు భావించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గురువారం 43,790మందికి పరీక్షలు చేయగా మొత్తం కేసుల సంఖ్య 2,37,187కు పెరిగింది. మరో ఆరుగురు మృతితో మొత్తం మరణాల సంఖ్య 1,330కు చేరింది.

    Read More »
  • 31 October

    కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి ఫొటో వైరల్

    హాట్ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి అయిపోయింది. గౌతమ్‌ కిచ్లూతో ఆమె వివాహం పూర్తయింది. ప్రేమ వ్యవహారం బయటికి వచ్చి నెల కూడా కాకుండానే పెళ్లిని ముగించేసింది కాజల్‌ అగర్వాల్‌. చాలా కాలం నుంచి పెళ్లి అనే వార్తలను ఖండిస్తూ వచ్చిన కాజల్‌.. చివరికి తన ప్రేమని, ప్రియుడిని తెలియజేసింది. అంతే.. అప్పటి నుంచి నిత్యం కాజల్‌ వార్తలలో నిలుస్తూనే ఉంది. అక్టోబర్‌ 30 శుక్రవారం ఆమె తన ప్రియుడు …

    Read More »
  • 31 October

    పవన్ కు సతీమణిగా సాయిపల్లవి…?

    పవన్‌కల్యాణ్‌ సరసన సాయిపల్లవి నటించనున్నారా? అంటే… ‘అవును’ అనే సమాధానం సినీ వర్గాల నుండి వినబడుతోంది. మలయాళ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రను పవన్‌ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రలో సాయిపల్లవి నటించనున్నారని వినికిడి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో పవన్‌తో పాటు మరో కథానాయకుడికి చోటుంది. అందులో రానా దగ్గుబాటి …

    Read More »
  • 31 October

    ఎమ్మెల్సీగా ఊర్మిళ

    బాలీవుడ్‌ నటి ఊర్మిళ ఎంఎల్‌సీగా నామినేట్‌ అయ్యారు. గవర్నర్‌ కోటా ద్వారా మహారాష్ట్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఆమెను ఎంపిక చేసినట్లు శివసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఊర్మిళతో మాట్లాడారు. ఆమె నామినేషన్‌ వేయడానికి అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్‌ ముంబై నుండి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపి గోపాల్‌ శెట్టి చేతిలో ఓడిపోయిన …

    Read More »
  • 31 October

    ఏపీలో కొత్తగా 2,886కరోనా కేసులు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,401 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,886 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కి పెరిగింది. తాజాగా కృష్ణాలో 448 కేసులు బయటపడగా.. తూర్పుగోదావరిలో 405, గుంటూరులో 385, చిత్తూరులో 296 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 3,623 మంది కరోనా నుంచి బయటపడగా.. మొత్తం రికవరీలు …

    Read More »
  • 28 October

    శ్రీకాంత్ సరసన శృతి

    శ్రీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘మరణమృదంగం’లో కథానాయికగా శృతి సోదీని ఎంపిక చేసినట్టు చిత్రనిర్మాత కుంచపు రమేశ్‌ తెలిపారు. తెలుగు తెరకు ‘పటాస్‌’తో కథానాయికగా పరిచయమైన ఆమె… తర్వాత ‘సుప్రీమ్‌’లో ప్రత్యేక గీతంలో సందడి చేశారు. మరో రెండు చిత్రాల్లో కథానాయికగా చేశారు. కొంత విరామం తర్వాత మళ్లీ తెలుగులో చిత్రం చేస్తున్నారు. వెంకటేశ్‌ రెబ్బా దర్శకత్వం వహిస్తున్న ‘మరణమృదంగం’ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్‌లో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఈ …

    Read More »
  • 28 October

    కరోనాపై షాకింగ్ న్యూస్

    వాతావరణ మార్పుల వల్ల ఏటా జలుబు, దగ్గు వంటివి రావడం సహజ పరిణామమే. కరోనా ఇన్ఫెక్షన్‌ కూడా జలుబులాగే వచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన వైరాలజిస్టు వెండీ బార్క్‌లే అంటున్నారు. ఏటా చలికాలంలో పలు రకాల సీజనల్‌ కరోనా వైర్‌సలు జలుబు, దగ్గుకు కారణమవుతుంటాయని, అవి ప్రతి 6 నుంచి 12 నెలలకోసారి ప్రజలకు సోకుతుంటాయని ఆమె తెలిపారు. ఇప్పుడు ఇన్ఫెక్షన్లు వ్యాపింపజేస్తున్న కరోనా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat