న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు.. లిమిటెడ్గానే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలో 33 వేలున్న వాంఖడే స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ నిర్వహించనున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య.. డిసెంబరు 3 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read More »TimeLine Layout
November, 2021
-
30 November
కిడ్నీలను సేఫ్ గా ఉంచే సూపర్ ఫుడ్ ఇదే!
కిడ్నీలను సేఫ్ గా ఉంచే సూపర్ ఫుడ్ ఇదే! రోజూ ఒక ఆపిల్ తింటే కిడ్నీలకు చాలా మంచిది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, కాన్బెర్రీలు కిడ్నీని కాపాడటంలో బెస్ట్. ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్కి కిడ్నీలో రాళ్లను తొలగించే శక్తి ఉంటుంది. క్యాబేజీలో సోడియం తక్కువ.. కిడ్నీ వ్యాధులను నిరోధిస్తుంది. చిలగడదుంప, కాకరకాయ కూడా కిడ్నీకి మేలు చేసేవే. కీరదోస, వాటర్మెలన్ వంటివి క్రమం తప్పకుండా తినాలి. కొబ్బరినీళ్లు కిడ్నీలకు …
Read More » -
29 November
రైతు వేదికలు…. చైతన్య దీపికలు- ఎమ్మెల్యే అరూరి….
రైతులంతా ఒక్కతాటిపై నడవాలి… సంఘటితమవ్వాలి… చైతన్యవంతులు కావాలి… లాభసాటి వ్యవసాయం చేయాలి… అందుకు ఒక వేదిక కావాలి… అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు.కాజిపేట మండలం మడికొండ, కడిపికొండ క్లస్టర్ల పరిధిలో 44లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, మేయర్ గుండు సుధారాణి గార్లతో …
Read More » -
29 November
రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు.
రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి. అంటూ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎం పీ లు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, …
Read More » -
29 November
12దేశాల్లో రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియంట్ (ఒమిక్రాన్) మరికొన్ని దేశాలకు వ్యాపించింది. ఇప్పటివరకు 12 దేశాల్లో ఈ కేసులను గుర్తించారు. సౌతాఫ్రికా, బోట్స్వానా, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్, ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే చాలా దేశాలు ముందుజాగ్రత్తగా ఇతర దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.
Read More » -
29 November
CMగా KCR ఉండటం అదృష్టం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన దీక్ష గుర్తుకు వస్తే ఒళ్లు పులకరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అప్పటి ఉద్యమ జ్ఞాపకాలను, అమరుల త్యాగాలను మర్చిపోలేమని చెప్పారు. తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణగా మారుస్తున్నారని కొనియాడారు. అంత గొప్ప మహా మనిషి మనకు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజలందరి అదృష్టమని వ్యాఖ్యానించారు.
Read More » -
29 November
రాధాకృష్ణ కుమార్ తో Style Star
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో జోష్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ పూర్తయ్యాక రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్తో ఓ సినిమా చేయనున్నాడని టాక్. రాధాకృష్ణ చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి తెగ నచ్చేసిందట. వెంటనే స్క్రిప్ట్ పూర్తిచేయాలని చెప్పాడని సమాచారం. అటు, రాధేశ్యామ్ తర్వాత రాధాకృష్ణ చేయబోయే సినిమా ఇదేనట.
Read More » -
29 November
మాస్కులు పెట్టుకోండయ్యా..?
‘కరోనా లేదు బిరోనా లేదు’ అని చాలా మంది మాస్కు పెట్టుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ భయపెడుతుండటంతో మాస్కు తప్పనిసరి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొక్కుబడిగా కాకుండా నోరు, ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలంటున్నారు. అలాగే టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ రాదనేది తప్పుడు ప్రచారమని, 2 డోసుల టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరని చెబుతున్నారు.
Read More » -
29 November
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి మళ్లీ అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆయన కరోనా బారి న పడి ఈ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.
Read More » -
29 November
కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధం
కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధానికి సిద్ధమైంది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నదని, రూల్ 267 కింద తక్షణమే ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ చైర్మన్‌ను ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. …
Read More »