Home / SLIDER / రైతు వేదికలు…. చైతన్య దీపికలు- ఎమ్మెల్యే అరూరి….

రైతు వేదికలు…. చైతన్య దీపికలు- ఎమ్మెల్యే అరూరి….

రైతులంతా ఒక్కతాటిపై నడవాలి… సంఘటితమవ్వాలి… చైతన్యవంతులు కావాలి… లాభసాటి వ్యవసాయం చేయాలి… అందుకు ఒక వేదిక కావాలి… అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు.కాజిపేట మండలం మడికొండ, కడిపికొండ క్లస్టర్ల పరిధిలో 44లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, మేయర్ గుండు సుధారాణి గార్లతో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…..

సీఎం కేసీఆర్‌ గారి ఆలోచనకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ వేదికలు వ్యవసాయంగంలో నూతన విప్లవానికి నాంది పలకనున్నాయని ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. సమైఖ్య పాలనలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వ్యవసాయరంగం నేడు స్వరాష్ట్రపాలనలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోందన్నారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తూ వారికి చేదోడువాదోడుగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం టీఆరెఎస్ ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం దండగ అన్న రైతన్న నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పండుగలా వ్యవసాయం చేస్తున్నారని, అందుకు సీఎం కేసీఆర్‌ గారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు అనేక సబ్సిడీలను అందిస్తూ సాగు విస్తీర్ణం పెంచడమే కారణమన్నారు. అంతేకాకుండా రైతులను సంఘటితం చేసి సమగ్ర పంటమార్పిడి విధానాలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

రైతులను సంఘటిత పరిచేందుకు ఇప్పటికే ప్రభుత్వం రైతు బంధు సమితిలను ఏర్పాటు చేసిందని, ఇవి రైతులను చైతన్యపరుస్తూ నూతన పద్దతుల్లో వ్యవసాయం చేసేందుకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. దీనికి తోడు రైతులను ఐక్యం చేసేందుకు, నియంత్రిత వ్యవసాయసాగు విధానం, సాగులో వినూత్న పద్ధతులు తదితర అంశాలను చర్చించేందుకు రైతు వేదికలు ఎంతగానో దోహదం చేయనున్నాయని తెలిపారు. అధికారులు రైతులను రైతు వేదికల ద్వారా ఏకతాటిపైకి తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. మొత్తంగా ఈ రైతువేదికలు రైతు చైతన్యదీపికలుగా భాసిల్లనున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి కో ఆర్డినేటర్ లలితా యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, కార్పొరేటర్లు, రైతు బందు సమితి సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat