TimeLine Layout

November, 2021

  • 27 November

    హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్

    కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 మళ్లీ హడలెత్తిస్తోంది. యువతపై ఎక్కువ ప్రభావమని శాస్త్రవేత్తలు చెప్పడం వణికిస్తోంది. దీని స్పైక్ ప్రొటీన్లోనే 30కిపైగా మ్యుటేషన్లు గుర్తించారు. డెల్టా, డెల్టా ప్లస్లలో 2-3 ఉండేవి. వ్యాక్సిన్లు ఈ వేరియంట్పై ఎలా పనిచేస్తాయనే క్లారిటీ లేదు. WHO దీనికి ‘ఒమిక్రాన్’ పేరు పెట్టి.. ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. దీంతో దేశాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి.

    Read More »
  • 27 November

    మాధురీ దీక్షిత్ అందానికి కారణం అదే.?

    1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది. ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.

    Read More »
  • 27 November

    ‘ప్రాజెక్ట్-కె’ మూవీపై భారీ అంచనాలు

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల వేగాన్ని పెంచాడు. నాట్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న ‘ప్రాజెక్ట్-కె’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ మొదటివారం నుంచి మొదలుకానుంది. కొత్త షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ అవుతాడట. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో భారీ సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దాదాపు రూ.300 కోట్లు బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుంది.

    Read More »
  • 27 November

    బాలయ్యను ఆకాశానికెత్తిన Heroine

    Tollywood Star Hero..నందమూరి అందగాడు బాలయ్యపై నటి ప్రగ్యా జైస్వాల్ ప్రశంసలు కురిపించింది. అఖండ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఆయనతో నటించాలనగానే ఎంతో సర్వస్ ఫీలయ్యాను. ఆయన్ను కలిసిన 5 నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్ ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్ను నేను ఇంత వరకు చూడలేదు. …

    Read More »
  • 27 November

    ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్

    ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్ అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు. అయితే.. కోహ్లికి బౌలింగ్ చేయడం తనకు ఎప్పుడూ కష్టంగా అనిపించలేదని పేర్కొన్నాడు. ఆ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మితికి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేదని అమీర్ అన్నాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లిని అమీర్ అవుట్ చేసిన విషయం తెలిసిందే.

    Read More »
  • 27 November

    యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పింది

    తెలంగాణ రైతాంగం పండించే యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ‘మేం ఎంతో ఆశతో వచ్చాం. కానీ కేంద్రం నిరాశ పర్చింది. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం. ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్ చెప్పమన్నాం. ఏడాదికోసారి టార్గెట్ ఇవ్వలేమని గోయల్ చెప్పారు’ అని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో TS మంత్రులు భేటీ అయిన …

    Read More »
  • 27 November

    6MLC లు TRS వశం

    తెలంగాణలో జరుగితున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పట్నం మహేందర్రెడ్డి(రంగారెడ్డి), శంభీపూర్ రాజు(రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్ నగర్), కూచికుళ్ల దామోదర్ రెడ్డి (మహబూబ్నగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

    Read More »
  • 27 November

    టాలీవుడ్లో మరో విషాదం

    టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావుకు ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా.. తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ కుమారుడు, కూతురు, భార్య ఉన్నారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా తొలి సినిమా. ఆ తర్వాత రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ నాగేశ్వరరావు తెరకెక్కించిన పోలీస్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి సినిమాలు చేశారు.

    Read More »
  • 27 November

    మిస్టర్ ఐపీఎల్ Suresh Raina

    Team India  Daring And Dashing Batsment సురేశ్ రైనా.. భారత క్రికెట్ జట్టు తరపున ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. చిరుత లాంటి ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు. చెన్నై తరపున ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి అత్యధిక రన్స్, హాఫ్ సెంచరీలు, ఫోర్లు, సిక్సర్ల రికార్డు ఈ లెఫ్ట్ హ్యాండర్ పేరు మీదనే ఉన్నాయి. మిస్టర్ ఐపీఎల్ అని బిరుదు తెచ్చుకున్నాడు. ధోనీకి అత్యంత సన్నిహితుడైన రైనా.. అతడు …

    Read More »
  • 27 November

    దేశంలో కొత్తగా 8,318 Carona Cases

    దేశంలో గత 24 గంటల్లో 9,69,354 కరోనా టెస్టులు చేయగా 8,318 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో 465 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,67,933 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,019గా ఉండగా, గత 24 గంటల్లో 10,967 మంది రికవరీ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 121.06 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat