TimeLine Layout

November, 2021

  • 11 November

    తెలంగాణ BJP నేతలకు మంత్రి గంగుల వార్నింగ్

    తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ధర్నాలు ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలని సూచించారు. తాము వడ్లు కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం పంట ప్రతి గింజను కొంటామని చెప్పారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.

    Read More »
  • 11 November

    డిసెంబర్ 28 నుంచి అంబేద్కర్ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు

    డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు (ఓల్డ్ బ్యాచ్) మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28 నుంచి 31 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు జనవరి 3 నుంచి 8, 2022 వరకు, మూడో సంవత్సరం పరీక్షలు జనవరి 17 నుంచి 22, 2022 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గం.ల వరకు …

    Read More »
  • 11 November

    దేశంలో విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ బాటలు

    దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జెడ్పీ‌ చైర్ పర్సన్ సరిత అన్నారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ మార్గ్‌లో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ‌ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ..విద్య అనేది రహస్యంగా దాచి పెట్టబడిన ధనం వంటిదన్నారు. విద్యయే సకల భోగాలను, కీర్తిని, …

    Read More »
  • 11 November

    రవితేజ అభిమానులకు Good News

    మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 154వ సినిమాలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన చిరు, ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వంలో మెగా ‘154’వ చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకు రాబోతున్నారు. ఇటీవలే ఈ …

    Read More »
  • 11 November

    తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు పెంపు

    తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.15 నుంచి రూ.25 వరకు పెరగనున్నాయి. పల్లెవెలుగు బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.10 నుంచి రూ.15 వరకు పెంచాలని ఆర్టీసీ యా జమాన్యం నిర్ణయించింది. సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రస్తుతం ఉన్న  రూ.10 చార్జీని రూ.20లకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. మెట్రో డీలక్స్‌లో రూ.15 ఉన్న కనీస చార్జీని రూ.25కు పెంచే  అవకాశం ఉంది. జిల్లాల్లోని …

    Read More »
  • 11 November

    రేపటి ధర్నాలకు సిద్ధం కావాలని TRSWP కేటీఆర్ పిలుపు

    తెలంగాణ సర్కార్ చాల రోజుల తర్వాత పోరుకు సిద్ధమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ధర్నాలు, నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెరాస పార్టీ.. ఇప్పుడు కేంద్రం ఫై పోరుకు సిద్ధమైంది. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండడంతో తెరాస సర్కార్ ఉద్యమం చేపట్టబోతుంది. ఒక్క ధాన్యం కూడా మిగలకుండా కేంద్రం కొనుగోలు చేయాలనీ..ఆలా చేసే వరకు ఉద్యమం చేపట్టాలని డిసైడ్ …

    Read More »
  • 9 November

    విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించిన ఓరుగల్లు జిల్లా ప్రజా ప్రతినిధులు….

    తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్  పార్టీ రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న సందర్బంగా నవంబర్ 29న వరంగల్ వేదికగా నిర్వహించనున్న విజయగర్జన సభా స్థలాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్ , చల్లా ధర్మారెడ్డి …

    Read More »
  • 9 November

    తమన్నా “భోళా శంక‌ర్” First Look Out

    మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆచార్య చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి చేసిన చిరు ఇప్పుడు గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే గాడ్ ఫాద‌ర్ చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, భోళా శంక‌ర్ చిత్రం నవంబర్ 11న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. నవంబ‌ర్ 15 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.ఇప్పటికే …

    Read More »
  • 9 November

    తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల

    తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంది. అలాగే కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ అవనున్నాయి. వీటన్నింటికీ కలిపి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలవనుంది. అలాగే ఈ ఎన్నికల కోసం నామినేషన్లను నవంబర్ 23 వరకూ …

    Read More »
  • 9 November

    హార్దిక్ పాండ్యాపై వేటు తప్పదా..?

    టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో  బీసీసీఐ చర్యలకు సిద్ధమైంది. త్వరలో జరిగే న్యూజిలాండ్ టూర్క టీమ్ ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫిటెనెస్ లేక ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యాను ఈ టూర్కు ఎంపిక చేయకుండా పక్కనబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్కప్లో అతడి ఫిట్నెస్పై నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. హార్దిక్ గాయపడ్డా జట్టులోకి ఎందుకు తీసుకున్నారో జట్టు నుంచి బీసీసీఐ వివరణ కోరనుంది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat